బల్దియా కార్యాలయంలో కరోనా కలకలం

హైదరాబాద్‌: నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా బల్దియా కార్యాలయంలో కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వడం క‌ల‌కలం రేపుతోంది. కమిషనర్ పేషీలో తాజాగా ఇద్దరు ఉద్యోగులు క‌రోనా బారిన ప‌డ్డారు. గతంలో మేయర్ పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా రావ‌డంతో అధికారులు మేయర్‌ కార్యాలయాన్ని శానిటైజ్ చేసి, మిగ‌తా ఉద్యోగుల‌ను ఇళ్లకు పంపించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో ఒక ఉన్నతాధికారి, చార్మినార్ జోన్ లో అకౌంట్ సెక్షన్ లో ప‌ని చేసే మరొక ఉద్యోగి క‌రోనా తో మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా కాటుకు గ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసి సిబ్బంది ఏడుగురు మృతి చెందారు.

బ‌ల్దియా కార్యాలయాలకు విజిటర్స్ ను అనుమతించక పోయినా సిబ్బంది మరియు ఉద్యోగులు… కరోనా బారిన పడుతుండ‌డం క‌ల‌కలం రేపుతోంది. దీంతో బల్దియాలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగులకు, సిబ్బందికి రూ.యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు గతంలో బల్దియా కార్యాలయం ముందు ఆందోళన చేశాయి.

new Corona positive cases registered at Baldia office in Hyderabad

Latest Updates