వరంగల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్

వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. తాజాగా వరంగల్ లో 6 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వరంగల్ నగరంలో ఐదుగురికి కరోనా సోకగా..జనగామ లో ఒకరికి  కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రాహ్మణ వాడకు చెందిన ఇద్దరు మహిళలకు, కాజీపేట విష్ణుపురికి చెందిన ఇద్దరికి, రాంనగర్ కు చెందిన మరో వ్యక్తికి, జనగామలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా వరంగల్ ఎంజియంలో కోవిడ్ వార్డులో 16 పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Latest Updates