బల్దియాలో కొత్త కార్పొరేషన్లు?

గ్రేటర్‌ హైదరాబాద్‌ 625 చ .కి.మీ విస్తీర్ణంలో దాదాపు కోటి 30 లక్షల జనాభా కలిగి ఉంది.జీహెచ్‌ ఎంసీ పరిధిలో 6 జోన్‌ లు, 30 సర్కిళ్లు.7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీలో రోడ్లు ఊడ్చడం, చెత్త తొలగింపు నుంచి పన్ను వసూలు,హౌజింగ్‌ , రోడ్ల నిర్మాణం వరకు అన్ని పనులు బల్దియా బాధ్యత తీసుకుంటుంది. జోన్‌ లు, సర్కిళ్లుగా అంచెంలంచెల వ్యవస్థతో పరిపాలన, రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారుల దృష్టికి రావడం,వాటిని పరిష్కారించడం ముఖ్యమైన సమస్య. గ్రీవెన్స్‌ వ్యవస్థను ఆన్‌ లైన్‌ చేయడం, కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి చర్యలతో సులభ పరిష్కారానికి అధికారులు మార్గం చూపారు. టెక్నాలజీ ప్రతి ఇంటిం టికి వ్యా పించిన నేపథ్యం లో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సులువైంది. కానీ బల్దియా నిర్వహణలో నిరంతరం సవాళ్లు ఎదుర్కొవాల్సివస్తోంది. దీంతో ఆర్థిక స్థితి,అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ ఎంసీ ని ఐదు కార్పొరేషన్‌ లుగా విభజించే సూత్రప్రాయ ఆలోచన ప్రభుత్వ అధికారుల వద్ద ఉందని తెలుస్తోంది.

పరిపాలన చేరువయ్యేలా….

హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ , శివారు మున్సిపాలిటీలను కలిపి 2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ ఎంసీ ఏర్పడినప్పుడు 5 జోన్‌ లు, 18 సర్కిళ్లుగా ఉన్న ఇప్పుడు బల్దియాలో 6 జోన్‌ లు, 30 సర్కిళ్లు ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో అభివృద్ధి కోసం జీహెచ్‌ ఎంసీ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యం లో ఆర్థిక స్థి తి అంతంత మాత్రంగానే ఉంది. రాబడి, ఖర్చు సమానమైపోయి నెలనెలా ఖజానా చెక్‌ చేసుకుంటూ పాలన నడిపించాల్సిన పరిస్థితి ఉంది. పాలన సౌలభ్యంతో పాటు, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ ను కార్పొరేషన్‌ లుగా విభజించే యోచన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వద్ద ఉందని సమాచారం. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన ప్రతి కార్పొరేషన్‌ లో 20 లక్షల జనాభా ఉండేలా వీటి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. 20 లక్షలకు పైగా జనాభా ఉంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు A-1 గుర్తింపు లభిస్తుంది. ఏటా రూ.200 కోట్లు గ్రాంటు లభిస్తుంది. ఐదు కార్పొరేషన్‌ లు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం నుంచి ఏటా రూ.1000 కోట్ల నిధులు గ్రాంటు గా పొందవచ్చనే దిశగా ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పారిశుద్ధ్య,ఆరోగ్యం, రెవెన్యూ పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాధ్యం కాకపోవచ్చు…!

జీహెచ్‌ ఎంసీ పరిధిలో 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల కొరతతో చాలా పనులు పెండింగ్‌ లో ఉంటున్నాయి. ఉద్యోగుల సంఖ్యను పెంచకుండా కార్పొరేషన్‌ లు ఏర్పాటు చేస్తే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదముందని జీహెచ్‌ ఎంసీ లోని ఓ సీ నియర్‌ అధికారి ఉన్నారు. ప్రస్తుత పద్ధతిలోనే జోనల్‌ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఐదు కార్పొరేషన్‌ లు భిన్నమైన విధాన నిర్ణయాలు తీసుకుంటే సిటీలో వేర్వేరు ప్రాం తాల్లో వేర్వేరు పాలన సాగుతుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉమ్మడి పాలసీ తయారు చేసి అన్ని కార్పొరేషన్‌ లతో అమలు చేయించడం, ఉద్యోగుల సంఖ్యను పెంచడం వంటి చర్యలు ముం దుగా తీసుకుంటే కార్పొరేషన్‌ ల ఏర్పాటు తర్వాత ఆలోచించవచ్చని ఆ అధికారి అన్నారు. మొత్తానికి సిటీలో ఐదు కార్పొరేషన్‌ ల ఏర్పాటుపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కేవలం పరిశీలన దశలోనే ఉన్న ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చుతుందో లేదో వేచి చూడాలి. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ పరిశీలన జరుగుతోందని తెలుస్తోంది.

Latest Updates