ప్రేమ పెళ్లి.. గంటకే పెటాకులయ్యింది

ప్రేమించుకున్నారు..తమ పెద్దలు కాదన్నాఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న గంటలోపే విడిపోయింది ఆ జంట. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైకి చెందిన బాలాజీ వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపల్ కమిషనర్.  అక్కడే పని చేసే రోజా అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు రోజూ పెళ్లి గురించి గొడవ పడేవారు. ఒక రోజు తనను పెళ్లి చేసుకొవాలంటూ రోజా ఆఫీసులో గొడవ చేసింది బ్లేడుతో చేయి కోసుకుంది. ఇలా అయితే కాదని బాలాజీ వెంటనే రోజాని తీసుకుని గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వాళ్ల తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు కిడ్నాప్ కేసు పెట్టారు.

పెళ్లయిన తర్వాత  కొత్త జంటను చూసి తట్టుకోలేక కోపంతో రోజాను ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడికి బాలాజీ కుటుంబ సభ్యులు కూడా వాళ్లింటికి వెళ్లారు. అక్కడ ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరగడంతో రోజాను ఆమె కుటుంబ సభ్యులు, బాలాజీని వాళ్ల కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. దీంతో పెళ్లయిన గంటకే విడిపోయింది ఆ జంట. పోలీసులు ఈ విషయంపై తెలిసిన పోలీసులు ఇరు కుటుంబాలను  పిలిచి నచ్చజెప్పినా వారు వినలేదట.

 

Latest Updates