ఈ డైట్ ఫాలో అవ్వండి.. కేజీల్లెక్కన బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో డైట్ ఫాలో అవుతారు. దానికి తగ్గట్టే రోజుకో కొత్త డైట్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న మరో డైట్ ‘కేంబ్రిడ్జి డైట్’.  ఈ డైట్ ఫాలో అవుతూ కేజీలు కేజీలు బరువు తగ్గుతున్నారు చాలామంది.

అసలు ఆ డైట్ ప్రత్యేకత ఏంటి?

మనం ఎంత హెల్దీగా ఉన్నామో చెప్పే మెజర్‌‌‌‌మెంట్స్‌‌లో ‘బాడీ మాస్ ఇండెక్స్(బీయంఐ)’ కూడా ఒకటి.  ఎత్తు, బరువు కొలతలను బట్టి  ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యంగా లేదా అనారోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇరవై దాటాక ఎత్తు మారదు. మారేదల్లా బరువు ఒక్కటే. అందుకే దానిపై కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్‌గా హెల్దీగా ఉన్నట్టే. బరువు.. పెరగటం సులువే.  క్యాలరీలు ఎక్కువగా ఉన్న కార్బొహైడ్రేట్ ఆహారం తింటే సరిపోతుంది. కానీ బరువు  తగ్గడానికే..  నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఉన్నట్టుండి  కార్బొహైడ్రేట్లను తీసుకోవటం మానేయలేం. అలా చేస్తే రక్తపోటు తగ్గిపోవటమే కాదు, చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే బరువు తగ్గాలంటే   సరైన ఆహార నియమాలు పాటించడం ఒక్కటే మార్గం. దానికోసమే ఈ డైట్‌‌లు…

ఈ డైట్‌‌లో..

కేంబ్రిడ్జి డైట్ గురించి సింపుల్‌‌గా చెప్పాలంటే…  ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చాలా వేగంగా బరువు తగ్గించే ఒక విధానం. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటున్న వ్యక్తికి పోషకాలు కావాల్సినంత మొత్తాలలో అందిస్తారు. కాకపోతే అది  డైరెక్ట్‌‌గా ఇవ్వకుండా సూప్స్ , షేక్స్ రూపంలో ఇస్తారు. వాటి సాయంతో  న్యూట్రిషన్స్, ప్రొటీన్స్ సరైన మోతాదులో అందేలా చూస్తారు.  బరువు, తగ్గాలనుకుంటున్న వాళ్లు మీల్స్‌‌కి బదులు డాక్టర్లు సూచించిన సూప్స్ , షేక్స్ తీసుకుంటారు.  బరువుని బట్టి ఇందులో ఆరు రకాల డైట్ ప్లాన్లు ఉంటాయి. వీటిద్వారా రోజుకి  415 క్యాలరీల నుంచి 1500 క్యాలరీల వరకూ కరిగించుకోవచ్చు.

ఇలా పనిచేస్తుంది

ఈ డైట్ ఎవరు పడితే వాళ్లు ఇంట్లో ఫాలో అయిపోయే డైట్ కాదు. వ్యక్తి బరువు, హెల్త్ కండిషన్‌‌ని బట్టి డైట్ చార్ట్‌‌ను  డైట్ స్పెషలిస్టులు తయారు చేస్తారు.  ఈ డైట్ పాటిస్తూ, ముందుకెళ్తున్నకొద్దీ స్పెషలిస్టు మార్పులు చేస్తూ ఉంటారు.  బరువు తగ్గే ప్రాసెస్‌‌లో శరీరం పోషకాలను కోల్పోకుండా, తగిన పోషకాలు అందే విధంగా స్పెషలిస్టులు కేర్ తీసుకుంటారు.

మనదేశంలో కూడా..

ఈ కేంబ్రిడ్జ్ డైట్ మనదేశంలో కూడా ఉంది. 1970లో డాక్టర్  అలాన్ హోవర్డ్ మొదటిసారి దీన్ని ప్రవేశపెట్టారు. నిజానికి మనదేశ ఆహార పద్ధతులకి ఈ డైట్ చాలా చక్కగా సరిపోతుంది. ఎందుకంటే మనదేశంలో అన్నం, రోటీలు ఎక్కువ మంది తింటారు. ఈ రెండింటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే చాలామంది ఎంత ట్రై  చేసినా బరువు తగ్గలేరు. 2018 నాటికి, ‘కేంబ్రిడ్జ్ డైట్ ఐఎంఎ’ రికమండేషన్స్ ప్రక్రారం ఈ డైట్  మనకి కూడా  బాగా సరిపోయింది. అయితే ఇది ఎంత వరకు సేఫ్ అనేది కొంతమంది డౌట్.

మంచిదేనా?

ఒక వ్యక్తికి, రోజువారీ క్యాలరీలు తీసుకోవడం తగ్గితే, శరీరంపై వెంటనే ఏదో ప్రభావం పడుతుంది. సైడ్ ఎఫెక్ట్ వచ్చి మత్తుగా ఉండటం, నిద్రలేమి వంటివి ఉంటాయని కొంతమంది అభిప్రాయం. అయితే కేంబ్రిడ్జ్ మాత్రం  ఈ డైట్‌‌కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్తుంది.  ఈ డైట్‌‌ను ఎక్కువ రోజులు పాటించకూడదు. రోజుకి వెయ్యి క్యాలరీల కన్నా తక్కువ ఆహారం.. వరసగా 12 రోజులకి మించి తినకూడదు. అన్నింటికన్నా ముఖ్యం.. ఈ డైట్  స్పెషలిస్టుల ఆధ్వర్యంలోనే పాటించాలి. ఎలాంటి మార్పులొచ్చినా వాళ్లు చూస్తారు. కాబట్టి సేఫ్టీ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని డైటీషియన్లు చెప్తున్నారు.

Latest Updates