కాశీలో ‘డ్రెస్ కోడ్’ నిబంధనలు

వారణాసిలోని విశ్వేర్వుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన తర్వాత ఆలయ పాలనా విభాగం కొత్త నిబంధనలను ప్రకటించింది. గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలనుకునే భక్తులు సంప్రదాయక దుస్తులు ధరించాలని… పురుషులు ధోతీకుర్తా, స్త్రీలు చీర లాంటి ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను మాత్రం జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమన్నారు. కేవలం దూరం నుంచే దర్శించుకోవాలని చెప్పింది. వారణాసి ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనలు త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Latest Updates