నూతన విద్యావిధానం పేరుకు మాత్రమే అద్భుతం: రణదీప్ సూర్జేవాలా

కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన నూతన విద్యావిధానం పేరుకు మాత్రమే అద్భుతంగా ఉందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా. స్పష్టమైన లక్ష్యాలు లేకుండా నూతన విద్యా విధానం ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిసస్తున్న సమయంలో విద్యాసంస్థలు మూసి ఉన్నపుడు ఈ విద్యా విధానం ఎలా అమలు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. 2014 -15  తర్వాత కేంద్రం విద్యా రంగానికి 4.14 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేంద్రం నిధులు కేటాయించకుండా తీసుకువచ్చిన విద్యా విధానం కేవలం కాగితానికే పరిమితమవుతుందన్నారు. పేద ప్రజల కుటుంబాల విద్యార్థులు ఆన్ లైన్ విద్య పొందలేరని.. పేద, ధనిక వర్గాల విద్యార్థుల చదువుల్లో తేడాలు వస్తాయన్నారు. 9శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి..4 శాతం పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందన్నారు. అనగారిన వర్గాల విద్యార్థులకు విద్యా రంగంలో అందించే సౌకర్యాలను నూతన విద్య విధానంలో ఏర్పాటు చేయలేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా ఈ నూతన విద్యా విధానం ఉందని ఆరోపించారు.

కేంద్ర విశ్వవిద్యాలయాలు ఒత్తిడిలో ఉన్నాయి

కేంద్ర విశ్వవిద్యాలయాలకు తమ వారిని ఛాన్సలర్లుగా నియమించుకుని నియంతృత్వ ధోరణిని కేంద్రం అవలంబిస్తుందన్నారు సుర్జేవాలా. కేంద్రం ధోరణితో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు ఎలా చేస్తారన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో వార్కర్లకు జీతాలు సరిగా ఇవ్వకుండా చిన్నారుల నైపుణ్యాన్ని ఎలా పెంచగలరు అని ప్రశ్నించారు. నాలుగు లక్షల అంగన్ వాడి సెంటర్లలో మరుగుదొడ్లు లేవు… లక్షకు పైగా అంగన్ వాడి సెంటర్లలో తాగునీటి సదుపాయాలు లేవని తెలిపారు. లక్షలాది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంచుకుని నూతన విద్యా విధానం ఎలా అమలు చేస్తారన్నారు. 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యాలయాలను ఒక విద్యాసంస్థగా ఎలా పరిగణిస్తారో చెప్పాలన్నారు. పాఠ్యంశాల ఎంపిక విషమంలో 70 ఏళ్ల పాటు కొనసాగుతున్న ప్రజాస్వామ్యయూత విద్యా విధాననాన్ని ఒక్కసారిగా  మార్చేశారు…ఒక్క వ్యక్తి ఢిల్లీలో కూర్చుని విద్యా వ్యవస్థని మార్చే విదంగా నూతన విద్యా విధానం ఉందన్నారు. ఇది విద్యార్థుల స్వతంత్రత,నైపుణ్యం ప్రమాదంలో పడేలా ఉందన్నారు.

విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్తున్నారు

కొంతమంది తప్ప ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజులు ఎవరు చెల్లించగలుగుతారన్నారు రణదీప్ సూర్జేవాలా. విద్యా విధానానికి కావాల్సిన సూచనలన్నీ కస్తూరి రంగన్ కు ఇచ్చామన్నారు. కస్తూరి రంగన్ చాలా మార్పులు తీసుకువచ్చారు ..అందుకు అభినందిస్తున్నామన్నారు. విద్యా రంగానికి బడ్జెట్ లో, నిధులు లేకుండా ,అనేక మార్పులు లేకుండా నూతన విద్యా విధానం సాధ్యం కాదని స్పష్టం చేశారు. యూపీఏ పదేళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ చట్టాలు తీసుకువచ్చామన్నారు. యూపీఏ పాలనలో 8.13గా GDP ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 4 శాతానికి పైగా వృద్ధి రేటు,పారిశ్రామిక రంగం లో 8 శాతానికి పైగా వృద్ధి రేటు ఉందని తెలిపారు. మోడీ పాలనలో సగానికిపైగా వృద్ధి రేటు పడిపోయిందని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ సోకుతుంటే ఆత్మనిర్బర్ భారత్ పేరుతో ప్రధాని,ఆరోగ్య మంత్రి మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారన్న రణదీప్ సూర్జేవాలా… ప్రస్తుత కష్ట కాలంలో దేశ యువత అందరం కలిసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Latest Updates