కొత్త ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పాలసీ వచ్చేసింది

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. 2019 నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు అంటే రెండేళ్ల పాటు ఈ విధానం అమలులో ఉండనుంది. ఈ మేరకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సోమేష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ జీవో జారీ చేశారు. ఈ నెల 1 నుంచే కొత్త లిక్కర్ పాలసీ అమలు కావల్సి ఉండగా, వివిధ కారణాలతో నెలపాటు దానిని రాష్ట్ర ప్రభుత్వం పొడించింది. గతంలో మాదిరిగానే ఈసారీ లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేయనున్నారు. దీని కోసం దరఖాస్తు చేసుకునే నాన్ రిఫండబుల్ ఫీజు ధరను లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. గతంలో ఉన్న 2,216 వైన్​ షాపులకే ఈసారీ లైసెన్స్ ఇవ్వనున్నారు. టర్నోవర్ ట్యాక్స్ ను గతంలో 8 శాతానికే పరిమితం చేయగా.. బీరుపై వచ్చే మార్జిన్‌‌‌‌‌‌‌‌ను 25 నుంచి 20 శాతానికి తగ్గించారు. లైసెన్స్​ ఫీజు చెల్లింపునకు గతంలో 6 కిస్తీలుండగా 8కి పెంచారు. లైసెన్స్‌‌‌‌‌‌‌‌ కోసం 9న నోటిఫిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. 16వ వరకు అప్లై చేసుకోవచ్చు. 18న అన్ని జిల్లాల్లో లక్కీ డ్రా తీస్తారు.

పెరిగిన ఫీజులతో మస్తు ఆదాయం

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్న విభాగం ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ కావడంతో వీలున్నంత వరకు ఫీజులు పెంచినట్లు తెలుస్తోంది. గత లిక్కర్​ పాలసీ కంటే ఈసారి ఏడాదికి ఒక్కో షాపు యజమాని రూ.5 లక్షలు అదనంగా లెవీ ఆఫ్ స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్తగా యాడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,216 షాపులు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి సుమారు రూ.110 కోట్ల ఆదాయం అదనంగా సమకూరే అవకాశం ఉంది. అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ ఫీజును లక్ష నుంచి రెండు లక్షలకు పెంచడంతో దానిపైనా బోలెడు ఆదాయం రానుంది. గత పాలసీలో రూ.410 కోట్ల దాకా అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ ఫీజు ద్వారా వచ్చింది. ఏపీ నుంచి కూడా వ్యాపారులు ఆసక్తి చూపుతుండటంతో ఈసారి అప్లికేషన్​ ఫీజు ద్వారానే వెయ్యి కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది.

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ ఫీజులు ఇలా..

గతంలో లైసెన్స్‌‌‌‌‌‌‌‌ ఫీజు నాలుగు స్లాబ్‌‌‌‌‌‌‌‌లుగా ఉండగా, ప్రస్తుతం 6 స్లాబులుగా మార్చారు. లైసెన్స్ ఫీజూపెంచారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజును నిర్ణయించారు.5 వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి రూ.50 లక్షలకు పెంచారు. 5 వేల నుంచి 50 వేల లోపు న్న ప్రాంతాల్లో రూ.55 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండింటికి గతంలో రూ.45 లక్షలే ఉంది. 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న చోట రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు.

టైమింగ్స్‌‌‌‌‌‌‌‌ ఇవే..

జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిచ్చారు. బ్యాంకు గ్యారంటీలో మార్పు చేసి, 1/6కు బదులు 1/8గా నిర్ణయించారు. ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైన్​ షాపుల యజమానులు ప్రజల్లో చైతన్యం కల్పించాలని పాలసీలో సూచించారు. షాపుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ఉండాలన్నారు.

ఏడాదికి లైసెన్స్‌‌‌‌‌‌‌‌ ఫీజు (రూ.లక్షల్లో..)

జనాభా                              ప్రస్తుతం             కొత్త విధానం

5 వేల వరకు                          45                   50

5 వేల నుంచి 50 వేల వరకు      45                   55

50 వేల నుంచి లక్ష దాకా          55                   60

లక్ష నుంచి 5 లక్షల వరకు         55                   65

5 లక్షల నుంచి 20 లక్షల దాకా  85                    85

20 లక్షలకు పైగా                     110                 110

Latest Updates