ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్

new feature in facebook

పోస్టులు ఎప్పటివరకుండాలో నిర్ణయించే ఆటో డిలీట్

ఫేస్ బుక్ ఫేస్ మొత్తం మారిపోతోంది. రంగు నుంచి రూపు దాకా, యాప్ నుంచి ప్రైవసీ దాకా అన్నింటినీ మార్చే స్తోంది. ఫేస్ బుక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని నీలి రంగు లోగోనే. ఓపెన్ చెయ్యగానే పైనా ఓ ‘బ్లూ బా ర్ ’ కనిపిస్తుం ది. ఆ బ్లూబా ర్ పైనే అకౌంట్ కు సంబంధించి న వివరాలు, హోం, ఫ్రెండ్ రిక్వెస్ట్ , సెట్టింగ్స్ వంటివి ఉంటాయి. ఇక, ఫేస్ బుక్లో ‘బ్లూ ’ ఉండబోదు. ఫేస్ బుక్ ప్రారంభమైన 15 ఏళ్ల తర్వాత డిజైన్ లో పెద్ద మార్పులే చేస్తోంది సంస్థ. ఆ మార్పుల్లో భాగంగానే బ్లూబార్ ను ఎత్తేసింది.లోగోను మార్చేసిం ది. స్క్వేర్  లోగో ప్లేస్ లో రౌండ్ లోగోను తీసుకొస్తోంది. బ్లూబార్ ను లేపేసి పేజీ మొత్తాన్ని ‘తెల్ల’గా చేసేస్తోంది. రీ డిజైన్ లో భాగంగా ‘ఎఫ్ బీ 5’ అనే సరికొత్త యాప్ ను తీసుకొస్తోంది. ఎఫ్ 8 డెవలపర్ కాన్ఫరెన్స్ లో భాగంగా సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ విషయాలు వెల్లడిం చారు. కొత్త మోడల్ మరింత ఆధునికంగా, ఫ్రెష్ గా ఉంటుందని జుకర్ బర్గ్ చెప్పారు. మార్పులు  చేసిన ఫేస్ బుక్  ప్రస్తుతం అమెరికా వరకే పరిమితం అయిం ది. అతి త్వరలోనే మిగతా దేశాల్లోనూ మారిన ఫేస్ బుక్ ముఖచిత్రం యూజర్లకు పరిచయం కానుంది.

పోస్టులు ఆటో డిలీట్

ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఎన్నాళ్లైనా అలాగే ఉండిపోతుంది. తాజా మార్పుల్లో ఆ పోస్టు ఎప్పటి వరకుండాలో యూజరే డిసైడ్ చేయొచ్చు. కొన్ని నిమిషాలుండాలా లేదా నెల, సంవత్సరం ఉండాలో ముందే ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. దాని కోసం ప్రైవసీలో భాగంగా ఆటోడిలీట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. పెట్టిన పోస్టు డిలీట్ అయ్యేలా టైం పెట్టుకోవచ్చన్నమాట. మెసెంజర్ , ఇన్ స్టాగ్రామ్ లనూ రీడిజైన్ చేస్తోంది సంస్థ. ఎప్పటినుంచో తీసుకొస్తామని చెబుతున్న ఫేస్ బుక్ డేటింగ్ యాప్ ను తీసుకొస్తోంది. అందులో కొత్తగా ‘సీక్రెట్ క్రష్’ ఆప్షన్ ను పెడుతున్నట్టు చెప్పారు.

డెస్క్ టాప్ మెసెంజర్

ఫేస్ బుక్ లో గ్రూప్స్ కూ ఇప్పుడు ప్రా ధాన్యం ఇస్తున్నారు . ఇప్పటి దాకా సైడ్ బా ర్ లో ఎక్కడో కింద ఉండే గ్రూప్స్ సెక్షన్ ను కుడివైపు టాప్ లో పెట్టింది. తద్వారా యూజర్లు తమకు కావాల్సిన గ్రూపులను ఈజీగా వెతుక్కో వచ్చని జుకర్ బర్గ్ చెప్పా రు. ఫేస్ బుక్ లో ఎంతో ముఖ్యమైన మెసెంజర్ కూ భారీ మార్పులు చేస్తున్నారు. ఎఫ్ 8 కాన్ఫరె న్స్ ప్రా రంభం కాకముందేమెసెంజర్ లో మార్పు లపై పొరపాటున కంపెనీ తనబ్లాగులో ప్రకటించేసిం ది. ‘మెసెంజర్ ఎట్ ఎఫ్ 8:ఫాస్టర్ , లై టర్ మెసెంజర్ , డిజైన్డ్ టు బిల్ట్ క్లో జర్ కనెక్షన్స్ ’ పేరిట మెసెంజర్ మార్పు లను వెల్లడించింది.అయితే, వెంటనే దానిని బ్లాగు నుంచి తీసేసిం ది.‘ప్రాజెక్ట్  లైట్ స్పీ డ్ ’ పేరిట మెసెంజర్ కు ఆ మార్పు లు చేస్తోంది. దాని సైజునూ 30 ఎంబీకి తగ్గించనుంది.దాని వల్ల వేగంగా డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు,స్పీడ్ గా బూట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. రెండుసెకన్లలో లోడ్ అయిపోతుం దట. అయితే, దానినిఎప్పు డు తీసుకొచ్చేది మాత్రం వెల్లడించలేదు.

అంతేకాదు, వాట్సాప్ డెస్క్ టాప్ లాగే మెసెంజర్ డెస్క్ టాప్ వె ర్షన్ నూ తీసుకొస్తోంది. గ్రూప్ వీడియో కాల్స్ సౌకర్యాన్నీ అందిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ తరహాలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అనే కొత్త ఫీచర్ ను పొందుపరిచింది. తద్వారా పోస్టులను ఎవరూ చూడాలన్న దానిపై ప్రైవసీ పెట్టుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ నుం చే వాట్సాప్ చాటింగ్ , వాట్సాప్ వీడియో కాల్స్ చేసే కొత్త ఫీచర్ నూ తెస్తోంది. ఫేస్ బుక్ యాప్ , మెసెంజర్ , వాట్సాప్,ఇన్ స్టాగ్రామ్ లను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు చీఫ్ ఇన్ ట్రాన్సి షన్ అనే కొత్త ఫీచర్ నూ పెడుతోంది. అంటే ఒక యాప్ నుంచి మరో యాప్ కూ ఆ యాప్ లోఉంటూనే మారొచ్చన్నమా ట.

ప్రైవసీ మెరుగ్గా

ఇటీవల ప్రైవసీ విషయంలో ఫేస్ బుక్ ఎన్నో విమర్శ-లను ఎదుర్కొం ది. కేంబ్రిడ్జి అనలిటి కా వ్యవహారంలోఅబాసుపాలైంది.

ఈ నేపథ్యం లోనే ప్రైవసీకీ పెద్ద పీట వేసినట్టు జుకర్బర్గ్ ప్రకటించారు. అందులో భాగంగా ఆరు సూత్రాలఆధారంగా ప్రైవసీని మరింత మెరుగు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇంటరాక్షన్స్ , ఎన్ క్రిప్షన్ , రెడ్యూసింగ్ పర్మనెన్స్ , సేఫ్టీ, ఇంటరాపరబిలిటీ, సెక్యూర్ డేటా స్టోరేజీ వంటి వాటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు.వాట్సాప్ , మెసెంజర్ , ఇన్ స్టాగ్రామ్ లను ఒకే ప్రైవసీ వేదికపై తీసుకొచ్చేలా ఇంటరాపరబిలిటీ పనిచేస్తుందన్నారు. డీఫాల్ట్ గానే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుందని చెప్పారు.

సీక్రెట్ క్రష్ ఫీచర్ అంటే…

ఫేస్ బుక్ డేటింగ్ యాప్ లో పెడుతున్న ఫీచర్ ఇది. అంటే, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్టు లో ఎవరైనా నచ్చారు అనిపిస్తే, తనే లవ్ అనిపిస్తే ఆ ఫ్రెండ్ను సీక్రెట్ క్రష్ లో యాడ్ చేసుకోవచ్చు. అలా 9 మంది ఫ్రెండ్స్ వరకూ యాడ్ చేసుకునే వీలుంటుం ది. ఒకవేళ సీక్రెట్ క్రష్ లో పెట్టిన ఫ్రెండ్ కూడా.. ఆ వ్యక్తిని సీక్రెట్ క్రష్ లో యాడ్ చేస్తే, ‘మ్యాచ్డ్ ’ అని నోటిఫికేషన్ వస్తుం ది. అంటే జంట దొరికినట్టే లెక్క. ఒకవేళ అవతలి ఫ్రెండ్ సీక్రెట్ క్రష్ లో యాడ్ చేయకుం టే నోటిఫికేషన్లు వెళ్లవు. ఇప్పటికే దీనిపై మంచి రెస్పాన్స్ వస్తోందని కంపెనీ చెప్పింది.

Latest Updates