వాట్సాప్​లో కొత్త ఫీచర్

కొన్నిసార్లు వాట్సాప్​లో ఒకరికి పంపే మెసేజ్​ను పొరపాటున మరొకరికి పంపిస్తుంటారు. మెసేజ్​ పంపే ముందు కాంటాక్ట్స్​లో సరిగ్గా చెక్​ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఈ పొరపాటు జరగకుండా ఉండేందుకు వాట్సాప్​ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ప్రకారం ఫొటోలు, వీడియోలు వంటి మీడియా ఫైల్స్​ని యూజర్లకు పంపే ముందు డబుల్​ చెక్​ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫీచర్​ ప్రకారం మెసేజ్​ పంపే ముందు వేరే యూజర్ల ప్రొఫైల్​ పిక్చర్​ ఎడమవైపు చిన్నగా కనిపిస్తుంది. అయితే కొత్త ఫీచర్​లో ఇమేజ్​ క్యాప్షన్​ కింది భాగంలో సెండ్​ చేయాలనుకున్న యూజర్​ నేమ్​ యాడ్​చేయాలి. దీనివల్ల ఆ పేరుపై పూర్తి అప్రమత్తంగా ఉంటారు. ఈ ఫీచర్​ ద్వారా ఎవరికి మెసేజ్​ పంపాలో వాళ్లకే సెండ్​ చేయొచ్చు. గ్రూప్​ మెసేజ్​లకు కూడా ఈ ఫీచర్​ అందుబాటులో ఉంటుంది.

Latest Updates