కొత్త GHMC చట్టం తీసుకువస్తాం : కేటీఆర్

మున్సిపల్ చట్టం నిబంధనలతో కొత్త GHMC చట్టం తీసుకువస్తామన్నారు మంత్రి కేటీఆర్. GHMC పై అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను GHMC చట్టంలోనూ ఉంచుతామన్నారు. మార్చి నెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లోనే కొత్త GHMC చట్టాన్ని సభలో పెడతామన్నారు.

అంతేకాదు భవన నిర్మాణ అనుమతులు, శానిటేషన్‌, గ్రీనరీ అంశాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. పౌరులకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీఎస్‌ బీపాస్‌ విధానానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు HMDA అనుమతుల్లోనూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్. కొత్త మున్సిపల్‌ చట్టంతో సమానంగా మార్పులు చేసేందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని GHMC అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్‌.

Latest Updates