ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ విశ్వభూషణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్రప్రభుత్వం. విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది.

చత్తీస్ గఢ్ రాష్ట్ర గవర్నర్ గా అనసూయా ఉయికేను నియమిస్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ పై సంతకం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 2009లో గవర్నర్ గా నియమితులయ్యారు ఈఎస్ఎల్ నరసింహన్. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించింది.

AP గవర్నర్ ప్రొఫైల్ ఇదీ

ఏపీ గవర్నర్ : విశ్వభూషణ్ హరిచందన్

సొంత రాష్ట్రం : ఒడిషా

పుట్టింది : 03/08/1934

భార్యపేరు  : సుప్రవ హరిచందన్

క్వాలిఫికేషన్  : బీఏ హానర్స్ ఎల్ఎల్ బీ

హాబీలు  :  చారిత్రక ప్రదేశాల సందర్శన, పుస్తకాలు చదవడం

1971లో జన సంఘ్ లో చేరిక

1977లో జనతా పార్టీ ఒడిషా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఎన్నిక

1988లో ఒడిషా జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

1996 ఏప్రిల్ లో బీజేపీలో చేరిక

భువనేశ్వర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నిక

భారతీయ జనతాపార్టీలో సుదీర్ఘకాలం సేవలు

Latest Updates