వచ్చే ఏడాది నుంచే కొత్త గురుకులాలు

 ప్రతి నియోజకవర్గంలో మరో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. మొత్తం 119 బీసీ గురుకులాలు వచ్చేవిద్యాసంవత్సరంలోనే ప్రారంభం కానున్నాయి. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 934కు చేరునుంది. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మూడు లక్షలు దాటనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగురుకులా లున్నాయి. ఆయా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని సొసైటీల పర్యవేక్షణలో ఈ విద్యాసంస్థలు నాణ్యమైన బోధన, వసతి అందిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఒకే సొసైటీ పరిధిలో ఉండగా, బీసీల కోసం మహాత్మా జ్యోతిబా పూలే, మైనార్టీల కోసం మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌ రెసిడెన్షియల్  ఎడ్యుకేషనల్‌ సొసైటీలు ఏర్పాటు చేశారు. 268 ఎస్సీ, 158 ఎస్టీ, 162 బీసీ, 204 మైనార్టీ విద్యా సంస్థలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. 2014కు ముందు ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పరిధిలోని 51 విద్యాసంస్థలు సేవలందిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 298 గురుకులాలు ఉండగా ఆ తర్వాత 544 గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో నాలుగు అంతకన్నా ఎక్కువ రెసిడెన్షియల్  విద్యాల యాలున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1,200 గురుకులాలు ఏర్పాటుచేసి ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు 7.50 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యాబోధన అందించాలని ప్రభుత్వ లక్ష్యం. ఇటీవల ఎన్నికల సమయంలో కేసీఆర్‌‌‌‌ హామీ మేరకు 119 బీసీ గురు కులాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తొలి ఏడాది ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఇందుకోసం 1,094 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌‌‌‌ , 595 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ‌‌ఇచ్చింది. మొత్తం 3,689 రెగ్యులర్‌‌‌‌ పోస్టులను 2022 -23 విద్యా సంవత్సరం వరకు దశల వారీగా భర్తీ చేయనున్నారు. అదే ఏడాది ఇంటర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ తరగతులు ప్రారంభిస్తారు.

గురుకులాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఎక్కడ విద్యాలయం ఏర్పాటు చేయాలో ప్రతిపాదనలు బీసీ సంక్షేమ శాఖకు పంపించాలి. ఈ ప్రక్రియను మార్చిలో పూర్తిచేసి అద్దె భవనాలు ఎంపిక చేస్తారు. మే నెలాఖరు కల్లా గురుకులాలు ఏర్పాటు చేసి అడ్మిషన్లు చేపడుతారు. తొలి ఏడాది సుమారు 28 వేల మంది విద్యార్థులకు అడ్మిషన్‌ దక్కే అవకాశముంది.

Latest Updates