ఇండ్లు మస్తు కొంటున్నరు

ఇండ్లు మస్తు కొంటున్నరు

జనవరి–మార్చిలో 58,290 యూనిట్లు అమ్ముడయ్యాయి
హైదరాబాద్‌‌లో 270 శాతం పెరిగిన కొత్త ప్రాపర్టీలు
అనరాక్ రిపోర్ట్‌‌లో వెల్లడి

కరోనా కేసులు పెరుగుతున్నా, ఎకానమీ రికవరీకి ఇబ్బందులు ఉండబోవని ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌ స్పష్టం చేశారు. జీడీపీ అంచనాలను మార్చాల్సిన అవసరం లేదని చెబుతూ, ఎకానమీని గట్టెక్కించడానికి పాలసీ టూల్స్‌‌ అన్నీ వాడతామని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌‌, ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు మరింత సమర్థంగా పనిచేసేలా ఎంకరేజ్‌‌ చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటల్‌‌ కరెన్సీ విషయంలో ప్రభుత్వం, ఆర్‌‌బీఐ ఆలోచనల్లో తేడా ఏమీ లేదని, దీనిపై వర్క్‌‌ చేస్తున్నామని వివరించారు.

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: దేశంలో ఇండ్ల  కొనుగోళ్లు పెరుగుతున్నాయి.  ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో టాప్‌ ఏడు సిటీలలో ఇళ్ల కొనుగోళ్లు 29 శాతం పెరగడం విశేషం. కొన్ని రాష్ట్రాలు స్టాంప్‌‌ డ్యూటీలను తగ్గించడం, హోమ్‌‌ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడం, డెవలపర్లు ప్రకటిస్తున్న ఆఫర్లతో  కరోనా సమస్యల నుంచి హౌసింగ్ సెక్టార్‌‌‌‌ బయటపడుతోందని కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. కిందటేడాది మొదటి మూడు నెలలతో పోల్చుకుంటే, ఈ ఏడాది జనవరి–మార్చి పిరియడ్‌‌లో హౌసింగ్ సేల్స్ పుంజుకున్నాయని తెలిపింది. దేశంలోని టాప్‌‌ ఏడు సిటీలలో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు స్థాయిలను దాటాయని తెలిపింది. హైదరాబాద్‌‌, ముంబై మెట్రో పాలిటన్‌‌ ఏరియా(ఎంఎంఆర్‌‌‌‌), పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌‌కతా, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌లలో  ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 58,290 ఇళ్లు అమ్ముడయ్యాయని అనరాక్ డేటా చెబుతోంది. కిందటేడాది ఇదే టైమ్‌‌లో ఈ సిటీలలో 45,200 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా, ఈ నెల పూర్తవ్వడానికి ఇంకో వారం రోజులు మిగిలి ఉంది. అందువలన ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌లో మరిన్ని ఇళ్లు సేల్‌‌ అవ్వొచ్చు. 
ప్రాపర్టీల ధరలు 2 శాతం పెరిగాయి..
ముంబై, పుణే సిటీలలో ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మొత్తం అమ్మకాలలో ఈ సిటీల వాటా 53 శాతంగా ఉంది.  కిందటేడాది జనవరి–మార్చి పిరియడ్‌‌తో పోల్చుకుంటే ముంబైలో ఇళ్ల అమ్మకాలు 46 %, పుణేలో 47 %  పెరిగాయి. టాప్ ఏడు సిటీలను పోలిస్తే ఒక్క బెంగళూరులోనే ఇళ్ల అమ్మకాలు పెద్దగా పెరగలేదు.  ప్రాపర్టీల ధరలు ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య సగటున 1–2%  పెరిగాయి. ఒక్క కోల్‌‌కతాలో ప్రాపర్టీల ధరలు పెద్దగా పెరగలేదని అనరాక్‌‌ డేటా చెబుతోంది. ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌లో ఇళ్ల ధరలు 2 శాతం పెరిగాయి.  కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రాపర్టీలు ఈ ఏడు సిటీలలో పెరిగాయని అనరాక్‌‌ పేర్కొంది. కిందటేడాది జనవరి–మార్చితో పోల్చుకుంటే ఈ ఏడాది కొత్త ప్రాపర్టీల లాంచ్‌‌లు 51 % పెరిగాయి. కిందటేడాది ఇదే టైమ్‌‌లో 41,220 కొత్త ప్రాపర్టీలు అందుబాటులోకి రాగా, ఈ ఏడాది అవి 62,130 యూనిట్లకు చేరుకున్నాయి. ఒక్క బెంగళూరులోనే  కొత్త ప్రాపర్టీల లాంచ్‌‌లు 11 % తగ్గాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య లాంచ్‌‌ అయిన కొత్త ప్రాపర్టీలలో 66 శాతం వాటా హైదరాబాద్‌‌, ముంబై, పుణే సిటీల నుంచే ఉంది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌–డిసెంబర్‌‌ నుంచి కన్జూమర్ డిమాండ్ ఊపందుకోవడంతో, డెవలపర్లు మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌‌లను ఈ క్వార్టర్‌‌‌‌లో లాంచ్ చేశారని అనరాక్ చైర్మన్ అనుజ్‌‌ పురి అన్నారు.  ‌‌