త్వరలో కొత్త ఐటీ రిటర్న్ ఫారాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పేయర్లకు ప్రభుత్వం ఇచ్చిన పలు మినహాయింపులను ఉపయోగించుకోవడానికి వీలుగా త్వరలో కొత్త ఐటీఆర్‌ ఫారాలను ప్రభుత్వం అందజేయనుంది. సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ డైరెక్ట్ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఈ మేరకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.

కొన్ని రకాల పన్ను చెల్లింపు గడువును కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30 వరకు పొడగించింది. ఈ నెల నుంచి జూన్‌ వరకు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్లపైనా పన్ను మినహా యింపులు ఉంటాయని తెలిపింది. దీంతో సీబీడీటీ ఐటీఆర్‌ ఫారాల్లో కొన్ని మార్పులు చేస్తున్నది. వీటి ద్వారా 80సి, 80డి, 980జి, 54, 54బి వంటి సెక్షన్ల కింద మినహాయింపులకు జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest Updates