స్టార్టప్​ కంపెనీల్లో కొత్త కొలువులు

వెలుగు, హైదరాబాద్భవిష్యత్ మీద నమ్మకంతో కొత్త ఉద్యోగుల నియామకంలో వెనుకంజ వేయడం లేదు స్టార్టప్‌‌‌‌లు. హైదరాబాద్‌‌‌‌తో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కరోనా వైరస్‌‌‌‌ నుంచి త్వరలోనే బయటపడేందుకు స్టార్టప్‌‌‌‌లు ప్రయత్నిస్తున్నాయి. కొత్త ఉద్యోగుల నియామకాలు చేపడుతూ.. మళ్లీ బిజినెస్‌‌‌‌లకు ఊతమిస్తున్నాయి. మెడికల్ ఇనొవేషన్స్, ఫార్మా, అగ్రిటెక్, ఎడ్యూటెక్, గేమింగ్ వంటి స్టార్టప్‌‌‌‌లలో రిక్రూట్‌‌‌‌మెంట్ పుంజుకుంటోంది. ఈ కరోనా క్రైసిస్‌‌‌‌లో కూడా  స్టార్టప్‌‌‌‌లు హెల్తీ గ్రోత్‌‌‌‌ కోసం చూస్తున్నట్టు స్టార్టప్‌‌‌‌ ఇండస్ట్రీల ప్రతినిధులు చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వాలు, ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్, రీసెర్చ్ సంస్థలు, వివిధ ఫౌండేషన్స్‌‌‌‌ ఇండియాలో స్టార్టప్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ను అభివృద్ధి చేయడానికి పూనుకున్నాయి. దీని కోసం  పెద్ద మొత్తంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌‌‌ ఫండింగ్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నాయి. స్టార్టప్‌‌‌‌ల కోసం ప్రత్యేకంగా ఫండింగ్ ఏర్పాటు చేసి, కొత్త ఐడియాలతో వచ్చే వారిని ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు సహకరిస్తున్నాయి. ఐసీఎంఆర్, మేకిన్ ఇండియా, తెలంగాణ ఇనొవేషన్(తెలంగాణ గవర్న్‌‌‌‌మెంట్), ఇస్రో, ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), బిర్లా ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికన్ ఇండియా ఫౌండేషన్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, అటల్ ఫౌండేషన్, నాస్కామ్, ఐఐటీ అహ్మదాబాద్, ఐఐటీ బెంగళూరు, ఐఐటీ హైదరాబాద్ వంటివి ఈ సమయంలో స్టార్టప్‌‌‌‌ల కోసం ఎమర్జెన్సీ ఫండింగ్‌‌‌‌ను విడుదల చేస్తున్నాయి. కొత్త స్టార్టప్‌‌‌‌లకు ఫండింగ్ ఇస్తున్నాయి. కొత్త ఫార్ములాతో వస్తే.. వారు స్టార్టప్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌లో ఎదిగేందుకు సహకరిస్తున్నాయి.

నాస్కామ్ 10,000 స్టార్టప్‌‌‌‌లకు ఫండింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ఫండింగ్‌‌‌‌ ఏర్పాటు చేస్తూ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్ కల్చర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తోంది. ఈ ఫండింగ్‌‌‌‌తో రిక్రూట్‌‌‌‌మెంట్లు  బాగా పెరుగుతున్నట్టు స్టార్టప్‌‌‌‌ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ మెడికల్‌‌‌‌కు, ఫార్మా, అగ్రిటెక్ స్టార్టప్‌‌‌‌లకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. శాటిలైట్ డేటా సాయంతో మనం ఏదైనా ఇన్‌‌‌‌ఫర్మేషన్ తీసుకుని, వ్యవసాయం సహా వివిధ రంగాలకి ఎలా ఉపయోగపడొచ్చో చూస్తున్నారు. ఇండియా వెలుపల నుంచి 500 స్టార్టప్‌‌‌‌లు, టెక్‌‌‌‌స్టార్ట్‌‌‌‌, ఐ వెంచర్స్, వై కాంబినేటర్ వంటి వాటి నుంచి కూడా మన ఇండియన్ స్టార్టప్‌‌‌‌లకు మంచి సహకారం అందుతోంది. దేశవ్యాప్తంగా 140 స్టార్టప్‌‌‌‌లు చాలా బాగా నడుస్తున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.

ఫండ్ రైజింగ్.. వెంటనే హైరింగ్ ప్రకటనలు..

కరోనా వైరస్ కూడా కొన్ని స్టార్టప్‌‌‌‌లకు మంచి అవకాశంగా మారింది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అపారెల్ స్టోర్‌‌‌‌‌‌‌‌ లాంటి స్టార్టప్‌‌‌‌లు.. కరోనా కాలంలో ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ ఉన్న మాస్క్‌‌‌‌లు అమ్మకం చేపట్టాయి. అలాగే కరోనాతో పెరిగిన ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్ మార్కెట్‌‌‌‌తో.. ఎడ్‌‌‌‌టెక్‌‌‌‌లో ఉన్న స్టార్టప్‌‌‌‌లు టీచర్ల హైరింగ్ ఫుల్‌‌‌‌గా చేపట్టాయి. ఏఐతో నడిచే స్టార్టప్‌‌‌‌ల్లోనే రిక్రూట్‌‌‌‌మెంట్ పెరిగింది. ప్రజలందరూ పూర్తిగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోకి మారడంతో, ఈ గ్రోసరీ, ఈకామర్స్ వంటి వాటికి, లాజిస్టిక్స్ రంగంలోని స్టార్టప్‌‌‌‌లకు మంచి అవకాశంగా మారింది. సాఫ్ట్‌‌‌‌బ్యాంక్‌‌‌‌ బ్యాక్డ్ లాజిస్టిక్స్ స్టార్టప్‌‌‌‌ డెల్హీవరి కూడా కొత్త ఫండింగ్ పొంది, హైరింగ్ చేపడుతోంది. డ్రీమ్‌‌‌‌11, ఐసర్‌‌‌‌‌‌‌‌టిక్ లాంటి యునికార్న్‌‌‌‌లు కూడా తమ టీమ్‌‌‌‌ సైజును పెంచుకోవాలని చూస్తున్నాయి. కరోనా వల్ల ఓ వైపు వ్యాపారాలు చతికిల పడ్డ మళ్లీ వాటిని కోలుకునేలా చేయాలని ఈ స్టార్టప్‌‌‌‌లు చూస్తున్నాయి. ఇండియన్ ఫిన్‌‌‌‌టెక్ స్టార్టప్ ఖాతాబుక్‌‌‌‌ ఇటీవలే గ్లోబల్‌‌‌‌ ఈక్విటీ సంస్థల  నుంచి 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ బిజినెస్ యాప్, బిజినెస్ ఓనర్లు తమ అకౌంట్లను, డిజిటల్‌‌‌‌గా చెక్‌‌‌‌ చేసుకునేందుకు సహకరిస్తోంది. ఫండ్ రైజ్ చేయగానే ఈ కంపెనీ ఫౌండర్‌‌‌‌ రవీష్ నరేష్‌‌‌‌ కొత్త నియామకాలను ప్రకటించారు.  తమ టెక్‌‌‌‌ టీమ్‌‌‌‌ను బలోపేతం చేసుకుంటామని ఈ కంపెనీ ఫౌండర్ చెప్పారు. క్యాష్‌‌‌‌బ్యాక్, డిస్కౌంట్ కూపన్ల సైట్ క్యాష్‌‌‌‌కరో కూడా ఈకామర్స్ వేవ్‌‌‌‌ను అందిపుచ్చుకుంటోంది. ఈ స్టార్టప్‌‌‌‌ కూడా గూర్గావ్, చెన్నై ఆఫీసుల్లో హైరింగ్ చేపట్టనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌‌‌‌లోని స్టార్టప్‌‌‌‌లు కూడా రిఫరల్ బేస్డ్‌‌‌‌తో కొత్త ఉద్యోగ నియామకాలను చేపడుతున్నాయి. జీతం ఇచ్చి ఉద్యోగులను నియమించుకోలేని స్టార్టప్‌‌‌‌లు విద్యార్థులకు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లు ఆఫర్ చేస్తున్నాయి. కరోనా స్టూడెంట్లకు మంచి అవకాశాలను కల్పిస్తోందని, కొత్త టెక్ స్కిల్స్‌‌‌‌ను, కంపెనీల పనితీరును అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా నిలిచింది.

ప్రస్తుతం స్టార్టప్‌‌‌‌ల్లో కొత్త కొత్త స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉంటోంది. స్టార్టప్‌‌‌‌లు ఉద్యోగులను చాలా జాగ్రత్తగా నియమించుకుంటున్నాయి. 5 మందిని తీసుకునే దగ్గర ముగ్గుర్ని తీసుకుంటున్నారు. ఈ క్రైసిస్‌‌‌‌లో కూడా ఉద్యోగాల హైరింగ్ బాగానే ఉంది. మెడికల్ ఇనోవేషన్స్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్, ఫార్మా, బయోటెక్‌‌‌‌లకు ఫండింగ్ వస్తోంది. వాటిల్లో రిక్రూట్‌‌‌‌మెంట్ బాగానే జరుగుతోంది. మిగిలిన కంపెనీల్లో కూడా హైరింగ్ పూర్తి స్థాయికి రావడానికి మూడు నుంచి ఐదు నెలలు పడుతుంది. కంపెనీలు చాలా వరకు రిఫరల్ హైరింగ్ చేస్తున్నాయి. కొత్త మార్కెట్‌‌‌‌ అందిపుచ్చుకుని, కొత్త వాళ్లను   హైర్ చేసుకుంటున్నాయి.

– దీప్తి రావుల, సీఈవో, వీ హబ్

ప్రస్తుతం స్టార్టప్‌‌లు ఎదగడం కోసం ఎమర్జెన్సీ ఫండింగ్ రిలీజ్ అవుతోంది. ఈ ఫండింగ్‌‌తో కంపెనీలు కొత్త రిక్రూట్‌‌మెంట్లు చేపడుతున్నాయి.  ఇండియన్ ఎంట్రప్రెన్యూర్షిప్‌ కల్చర్‌‌‌‌ను పెంచేందుకు ప్రభుత్వాలు, సంస్థలు, ఫౌండేషన్స్, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్‌‌స్టిట్యూషన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఫండింగ్‌ ఇచ్చి, వాటిని ఒక దారిలోకి తేవాలనుకుంటున్నాయి. కొత్త ఐడియాలతో వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఫార్మా, అగ్రిటెక్, ఏఐ బేస్డ్ మెడికల్ వంటి స్టార్టప్‌‌లకు మంచి డిమాండ్ ఉంది. రూరల్స్‌‌కు హెల్ప్ చేయడం కోసం చూస్తున్నాయి. టెక్నాలజీతో ప్రజలకు ఎలా సాయం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి.

– భానుప్రకాశ్​రెడ్డి సీఈఓ, బీన్​ఫీల్డ్​ కన్సల్టింగ్

ఫ్లిప్ కార్ట్ లో కర్ణాటక మామిడిపళ్లు

Latest Updates