కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు చాలా ప్రయోజనాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన ఛలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ చట్టాలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాన్నాళ్లుగా రైతులు చేస్తున్న పలు డిమాండ్లను కొత్త అగ్రి చట్టాలు నెరవేరుస్తాయని మోడీ అన్నారు. ఈ చట్టాలతో రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌‌లో వ్యవసాయ చట్టాల గురించి మోడీ పలు విషయాలు పంచుకన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నూతన ద్వారాలను తెరిచాయి. ఈ చట్టాలు రైతులకు సరికొత్త అవకాశాలను తీసుకొచ్చాయి. చాలా ఏళ్లుగా రైతులతోపాటు పలు రాజకీయ పార్టీలు చేస్తున్న కొన్ని డిమాండ్లను నెరవేర్చేలా ఈ చట్టాలను రూపొందించాం. సుదీర్ఘ చర్చల తర్వాతే ఈ సంస్కరణలకు పార్లమెంట్ చట్టబద్ధత కల్పించింది’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates