నేటి నుంచే కొత్త మద్యం పాలసీ

 పాత మద్యం దుకాణాల గడువు గురువారంతో ముగిసింది. నేటి నుంచి కొత్త మద్యం పాలసీ ప్రారంభం కానుంది. గత మద్యం పాలసీలో భాగంగా పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఇప్పడు కొత్త మద్యం పాలసీలో పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు ఎత్తివేశారు. దీంతో మద్యం వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 595 షాపులున్నాయి. వీటికి 8,692 మంది టెండర్లు దాఖలు చేశారు. వీటిలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా 173 షాపులకు 1,238, రంగారెడ్డి జిల్లాలో 422 షాపులకు 7,454 మంది  టెండర్లు వేశారు. కానీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 586 షాపులకే లాటరీ ద్వారా డ్రా తీశారు. మిగిలిన 9 మద్యం షాపులకు డ్రాను వాయిదా వేసినట్లు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 173 మద్యం షాపులకు 166 షాపులు ఎంపిక చేశారు. అదేవిధంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 422 షాపులకు 420 షాపులను ఎంపిక చేశారు.  ఈ షాపులన్నీ నేటి నుంచి కొత్త ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీ ప్రకారం నడవనున్నాయి.  ప్రతీ మద్యం దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా జిల్లా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలను జిల్లా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ కార్యాలయం కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంకు అనుసంధానం చేస్తున్నారు. మద్యం షాపులు తెరచి ఉంచే సమయాలను, విధి విధానాలను కూడా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ వెల్లడించింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు.మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు విధిగా సమీపంలోని పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అదనంగా రూ.2 లక్షల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. కానీ.. కొత్త మద్యం పాలసీతో ఈ అదనపు ఫీజు చెల్లించకుండానే పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించారు. 

Latest Updates