నవంబర్ 1నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ

నవంబర్ 1వ తేదీ తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. MRP రేట్ల కంటే ఎక్కువ ధరకు లిక్కర్ అమ్మొద్దంటూ ఎక్సైజ్‌శాఖ సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఎక్సైజ్‌శాఖ తరఫున మరో రూ.2 నుంచి 3లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు.

ఇవాళ(బుధవారం)సాయంత్రం 4గంటలకు వైన్స్ షాపుల కోసం దరఖాస్తుకు గడువు ముగియనుంది. 4 గంటల్లోపు ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నారు అధికారులు.

Latest Updates