ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు

New mlcs sworn by Deputy Chairmen vidya sagar in legislative council

నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు ఈ రోజు (సోమవారం) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని జూబ్లీహాల్ లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. వారి చేత  ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, మహమూద్ అలి, శేరీ సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హాసన్ అఫెంది ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మల్లా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి.. ఇతర నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Latest Updates