ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు

కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ముందుగా గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Latest Updates