కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉన్నంత పోటీ గ్యాడ్జెట్ల విషయంలో మరోదానికి లేదు. ప్రతి కంపెనీ కొత్త రకం స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మార్కెట్లో కి ప్రవేశపెడుతోంది. ఈ నెలలో కూడా కొన్ని కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. మరి ఆ ఫోన్లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

రియల్ మి3 ప్రొ

ఒప్పో బ్రాండ్ కు చెందిన రియల్ మి నుంచి గత నెలలో రియల్ మి 3 వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఈ నెలలోనే ‘రియల్ మి 3 ప్రొ’విడుదల కానుంది.

6.3 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

6 జీబీ ర్యామ్, 64/128జీబీ మెమొరీ

4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

20 ఎంపీ ఫ్రంట్ కెమెరా,

16+5ఎంపీ ప్రైమరీ కెమెరా

డ్యు యల్ నానో సిమ్, ఫేస్ అన్ లాక్

ధర రూ.18,990 (అంచనా)

ఒప్పొ రె నో

హై ఎండ్ మోడల్ ఫోన్లలో ఒప్పో నుంచి రానున్న మరో ఫోన్ ‘రెనో’. ఈ నెల పదో తేదీన చైనాలో విడుదల అవుతోంది. ఇదే

నెల చివరి వారంలోపు మన దేశంలో విడుదల అవ్వనుంది.

6.4 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

6/8జీబీ ర్యామ్, 128/256 జీబీ

మెమొరీ

ట్రిపుల్ మెయిన్ కెమెరా

(48+20+టీఓఎఫ్ 3డీ కెమెరా)

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్​ చార్జిం గ్

ధర: రూ.29,990 (అంచనా)

రెడ్ మి వై3

షియోమి సంస్థ నుంచి రానున్న మరో బడ్జెట్ ఫోన్ ‘రెడ్ మి వై3’. ఈ నెల 30న విడుదలయ్యే అవకాశం ఉంది.

6.0 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

3జీబీ/32 జీబీ మెమొరీ

డ్యు యల్ నానో సిమ్

ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ సెన్సర్

డ్యు యల్ రేర్ కెమెరా (12+5ఎంపీ)

16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

3,300 ఎంఏహెచ్ బ్యాటరీ

ధర: రూ. 9,990 (అంచనా)

నోకియా 9

ఫ్లాగ్ షిప్‌ రేంజ్ స్మార్ట్​ఫోన్లలో మార్కెట్ కోసం నోకియాచాలా కాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది. వివిధ కొత్త

మోడళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ నెలలో ‘నోకియా9’ ఫోన్ ను విడుదల చేయనుంది.

5.99 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

ఐదు 12 ఎంపీ కెమెరాలు వెనుకవైపు

20 ఎంపీ ఫ్రంట్ కెమెరా

6జీబీ/128జీబీ మెమొరీ

3,320 ఎంఏహెచ్

బ్యాటరీ

ధర రూ.49,950(అంచనా)

శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్

ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫోన్ ‘శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్’. మడతపెట్టే ఫోన్ గా గుర్తింపు పొందిన ఈ ఫోన్

విదేశాల్లో ఎప్పుడో విడుదలైంది. ఈ నెల 26న మన దేశంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.

7.3 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

12జీబీ/526జీబీ మెమొరీ

12+12+16 ఎంపీ ట్రిపుల్ కెమెరా,

10+8 ఎంపీ డబుల్ సెల్ఫీ కెమెరా, 10 ఎంపీ కవర్ కెమెరా

4380 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్ లెస్ చార్జిం గ్

ధర: రూ.1,40,790 (అంచనా)

హువావీ పీ30, పీ30 ప్రొ

గత నెలలో పారిస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో హువావీ సంస్థ పీ30, పీ30 ప్రొ మోడళ్లను ఆవిష్కరించింది. ఈ నెల చివరి వారంలో ఇవి మనదేశంలో విడుదల కానున్నాయి. ఇవి హైఎండ్ మోడల్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్.

హువావీ పీ30

6.1 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్,

3650ఎంఏహెచ్ బ్యాటరీ

6/8జీబీ ర్యామ్, 128/256జీబీ

మెమొరీ

40+16+8ఎంపీ ట్రిపుల్ ప్రైమరీ

కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ప్రింట్ అండర్ డిస్ ప్లే, హైబ్రిడ్ సిమ్ స్లాట్

ధర: రూ.62,290 (అంచనా)

రెడ్ మి7

చైనాకు చెందిన షియోమి నుంచి వస్తున్నమరో బడ్జెట్ ఫోన్ రెడ్ మి 7. చైనాలో ఇప్పటికే విడుదలైన ఈ ఫోన్ ఈ నెల చివరి వారంలోపు మనదేశంలో విడుదలవుతుంది.

6.2 అంగుళాల తెర

ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్

2జీబీ/16 జీబీ, 3జీబీ/32 జీబీ మెమొరీ

12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ

కెమెరా

4000 ఎంఏహెచ్ బ్యాటరీ

డ్యు యల్ నానో సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్

ధర: రూ. 7,190 (అంచనా)

Latest Updates