కొత్త ఎంవీ చట్టం అమలు చేయట్లే

  • ఫైన్ల గురించి చర్చిస్తున్నాం..తేలాకే అమల్లోకి తెస్తం
  • రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ వెల్లడి

రాష్ట్రంలో ఆదివారం నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమలుచేయలేదని రవాణా శాఖ ప్రిన్సి పల్‌‌ సెక్రటరీ సునీల్‌‌ శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాకే పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందన్నారు . నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి వసూలు చేయాల్సిన ఫైన్ల గురించి చర్చిస్తున్నట్లు చెప్పారు . కొత్త చట్టం అమలుకాలేదని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించామన్నారు. ఏపీ, కర్నాటక, కేరళ సహా మరికొన్న రాష్ట్రాల్లో నూ ఈ చట్టాన్ ని అమలుచేయడం లేదన్నారు .

వీటికి వర్తిస్తుంది..

డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్​లే కుండా వాహనం నడపడం… వంటి కోర్టు శిక్ష విధించే వాటికి కొత్త చట్టం వర్తిస్తుందని అధికారులు చెప్పారు .

Latest Updates