హెల్మెట్ లేకుండా పోలీస్ డ్రైవింగ్.. ఇదేమని అడిగితే బూతులు తిట్టాడు

కొత్త మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత  డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉన్న  వారికి జరిమానాల మోత మోగుతోంది . ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా..,  డ్రైవింగ్ చేసే సమయంలో వాహనాలకు చెందిన కీలక పత్రాలను తీసుకెళ్లని సాధారణ పౌరులకి పోలీసులు చలాన్లు వేస్తున్నారు.  ఒకవేళ  పోలీసులే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే…?. బీహార్ లోని బుక్సార్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న పోలీస్ ను  ఓ యువకుడు ప్రశ్నించినందకు అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుక్సార్ లోని శిక్షాక్ కాలనీలో నివసిస్తున్న కమల్ కుమార్ అనే యువకుడు శనివారం రోజున డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లఘించాడు. దీంతో రోషన్ కుమార్ అనే పోలీస్ కమల్ కు రూ .11,000 జరిమానా విధించారు. చేసేదేమిలేక కమల్ ఆ జరిమానాను కట్టాడు.

ఇది జరిగిన తర్వాతి రోజే  హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న సదరు పోలీస్ ను గమనించిన ఆ యువకుడు.. అతన్ని అడ్డుకొని ప్రశ్నించాడు.  పోలీసులై ఉండి మీరే రూల్స్ ను అతిక్రమిస్తారా.? మీకొక న్యాయం.. సాధారణ ప్రజలకో న్యాయమా ? అంటూ  అతను  ప్రశ్నించే సరికి ఆ పోలీసు కు చిర్రెత్తుకొచ్చి , కోపం తట్టుకోలేక నడిరోడ్డు మీద అతన్ని దూషించాడు. ఈ సంఘటన మొత్తం మొబైల్‌లో రికార్డ్ అయింది. ఈ  వీడియో క్లిప్ చూసిన తరువాత, బక్సార్ ఎస్పీ ఆ పోలీసుపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లఘించడమే కాకుండా ఓ వ్యక్తిని అనవసరంగా దూషించినందుకు అతన్ని విధుల నుంచి  సస్పెండ్ చేశారు.

new motor vehicle act policeman not wearing helmet misbehaves man for asking question bihar buxar

 

Latest Updates