శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త పార్కింగ్ విధానం

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త పార్కింగ్ విధానం ప్రవేశపెట్టారు. ప్యాసింజెర్ ఈజ్ ప్రైమ్ అనే కార్యక్రమం కింద పార్కింగ్ నుంచి వెలుపలికి వచ్చే సమయంలో వాహనాల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు, సులభతరమైన, యూజర్-ఫ్రెండ్లీ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త పార్కింగ్ విధానంలో  పార్కింగ్ జోన్‌ లోపలికి వెళ్లే, బయటికి తరలిపోయే వాహనాలు రాకపోకలను సులభతరం అవుతాయి.  కార్ పార్క్ ఏరియాలోని ఎనిమిది పార్కింగ్ జోన్‌లలో ఎనిమిది పే బూత్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పార్కింగ్ ఫీజును సులభంగా చెల్లించి, ఎగ్జిట్ దగ్గర కేవలం ఫీజు చెల్లింపు రసీదును స్కాన్ చేసి, పార్కింగ్ నుంచి బైటికి వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 3 నుంచి అమలులోకి వచ్చిన ఈ నూతన పార్కింగ్ విధానం 24 గంటల పాటూ పని చేస్తుంది. ఈ పార్కింగ్ విధానంలో వినియోగదారులకు సహకరించేందుకు పార్కింగ్ ప్రదేశంలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.

కొత్త పార్కింగ్ సూచనలు:  ఎంట్రెన్స్ వద్ద పార్కింగ్ స్లిప్ తీసుకోవాలి.  అన్ని పార్కింగ్ జోన్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఏ పే బూత్‌లోనైనా ఫీజు చెల్లించి, రసీదు తీసువాలి.  ఎగ్జిట్ దగ్గర ఉన్న స్కానర్ ఎదుట రసీదును స్కాన్ చేసుకోవాలి. పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్లాలి. నూతన పార్కింగ్ విధానంతో ఎలాంటి ఇబ్బందులు లేని సౌకర్యం వాహనదారులకు లభిస్తుంది.

Latest Updates