బీసీ సంక్షేమ శాఖలో కొత్త‌ పోస్టులకు జీవో జారీ

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖలో 20 కొత్త పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఫైనాన్స్  ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు జీవో జారీ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌లో కొత్త పోస్టుల పర్మిషన్ కోసం ప్రభుత్వానికి అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చీఫ్ ఎగ్జిక్ యూటివ్ ఆఫీసర్, మేనేజర్ (అడ్మిన్), మేనేజర్ (ఫైనాన్స్), అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, కంపెనీ సెక్రెటరీ, కన్సల్టెంట్ పోస్టులు ఒక్కోటి చొప్పున క్రియేట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates