ఫేస్‌‌బుక్‌‌లో కొత్త ప్రైవసీ ఫీచర్స్‌‌

యూజర్లకు సంబంధించిన ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను మరింతగా డెవలప్‌‌ చేస్తున్న ఫేస్‌‌బుక్‌‌ మరో నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా యూజర్లకు మరింత ప్రైవసీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త ఫీచర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సెట్టింగ్స్‌‌లో, ప్రైవసీ షార్ట్‌‌కట్స్‌‌లో.. రివ్యూ ఎ ఫ్యూ ఇంపార్టెంట్‌‌ ప్రైవసీ సెట్టింగ్స్‌‌లో కొత్త ఫీచర్స్‌‌ అప్‌‌డేట్‌‌ చేసుకోవచ్చు.  ‘హూ కెన్‌‌ సీ వాట్‌‌ యూ షేర్’ అనే ఫీచర్‌‌‌‌ ద్వారా యూజర్ల ప్రొఫైల్‌‌ ఎవరెవరు చూడొచ్చో సెట్‌‌ చేసుకోవచ్చు. అంటే మొబైల్‌‌ నంబర్‌‌‌‌, ఈమెయిల్‌‌, పోస్ట్స్‌‌ అన్నింటిని అవసరమైనవాళ్లకు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.

‘హౌ టు కీప్‌‌ యువర్‌‌‌‌ అకౌంట్‌‌ సెక్యూర్‌‌‌‌’ ఫీచర్‌‌‌‌ ద్వారా అకౌంట్‌‌ను మరింత సెక్యూర్‌‌‌‌గా మార్చుకోవచ్చు. దీనిలో స్ట్రాంగ్‌‌ పాస్‌‌వర్డ్‌‌ సెట్‌‌ చేసుకోవడంతోపాటు, లాగిన్‌‌ అలర్ట్స్‌‌ కూడా పెట్టుకోవచ్చు.  ‘హౌ పీపుల్‌‌ కెన్‌‌ ఫైండ్‌‌ యు’ అనే మరో ఫీచర్‌‌‌‌ ద్వారా మీకు సంబంధించిన ఫ్రెండ్‌‌ రిక్వెస్ట్స్‌‌, సజెషన్స్‌‌ ఎలా రావాలో.. ఎవరెవరికి వెళ్లాలో సెట్‌‌ చేసుకోవచ్చు.  ‘యువర్‌‌‌‌ డేటా సెట్టింగ్స్‌‌ ఆన్‌‌ ఫేస్‌‌బుక్‌‌’ అనే ఇంకో ఫీచర్‌‌‌‌ ద్వారా ఫేస్‌‌బుక్‌‌తో ఏయే యాప్స్‌‌, వెబ్‌‌సైట్స్‌‌లోకి లాగిన్‌‌ అయ్యారో తెలుసుకోవచ్చు. వాటిలో అక్కర్లేవనుకున్న వాటిని ఫేస్‌‌బుక్‌‌లోంచి రిమూవ్‌‌ చేయొచ్చు.

Latest Updates