రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

దుమ్ము, దూళితో పాటు, ప్రొటీన్స్ లోపం వల్ల బట్ట తలవస్తుంది. అలా బట్టతల ఉంటే జీవితం సర్వ నాశనం అయ్యిందని తెగ ఫీలవుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన యువకులకి బట్టతల ఉంటే పెళ్లికాదని భయం.ఇలా ఒకటేమిటి కాలేజీ, ఆఫీస్, ఇంటా, బయట తలెత్తే ఇబ్బందులు మాటల్లో చెప్పలేం . కానీ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో బట్టతల ఉన్న యువకులంటే అమ్మాయిలకు ఇష్టమని తేలింది. మిగిలిన వారికంటే నీతినిజాయితీ బట్టతల ఉన్నవారికే ఎక్కువగా ఉంటాయని, వాటితో పాటు కాన్ఫిడెంట్స్, ప్రేమ, అనారోగ్య సమస్యలు తలెత్తవని శాస్త్రీయంగా తేల్చారు.

పుట్టిన పసిపిల్లలకు జట్టు ఉండదు. కానీ చూడటానికి అందంగా..ముద్దొచ్చేస్తుంటారు. ఇదే లాజిక్ బట్టతల ఉన్న మగవారికి కూడా వర్తిస్తుందని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్ట్ లు చెబుతున్నారు. బట్టతలకు కారణమయ్యే వెలస్ హెయిర్ అనే ఫోలికల్స్  అప్పుడే పుట్టిన పసిపిల్లల నెత్తిపైనా ఉంటాయి. అందుకే వాళ్ల బోడిగుండోళ్లుగా కనిపిస్తారు. చూడ్డానికి తెగ ముద్దొస్తుంటారు కనుక ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా పిల్లల్ని ముద్దు చేస్తుంటారు.

ఇక ఆహారపు అలవాట్ల వల్ల 35 ఏళ్లు దాటిన వారిలో 65 శాతం తల వెంట్రకులకు రాలిపోతున్నాయి.  అయితే ఇది కేవలం భౌతిక మార్పు మాత్రమేనని, బట్టతల ఉన్నవాళ్లు మానసికంగా ధైర్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  బట్టతల ఆరోగ్యానికి కూడా మంచిదేనని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వీరికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని గుర్తించారు. కాబట్టి ఇకపై జట్టు లేదన్న బాధ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసేయ్యండి.

 

 

Latest Updates