రెవెన్యూ పెంచుకోవాలంటే కొత్త దారులు వెతకాల్సిందే

న్యూఢిల్లీ: పడిపోయిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, గ్రోత్‌‌కు సపోర్ట్ ఇచ్చేలా షార్ట్ టర్మ్‌‌లో పబ్లిక్ స్పెండింగ్‌‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పెంచవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. ఎక్కువ మొత్తంలో వెచ్చింపు కోసం ప్రభుత్వం  కొత్త రెవెన్యూ మార్గాలను గుర్తించాల్సినవసరం ఉందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 92వ యాన్యువల్ కన్వెన్షన్‌‌లో గీతా గోపినాథ్ మాట్లాడారు. ప్రైవేట్‌‌రంగం డిమాండ్‌‌లో తీవ్ర స్లోడౌన్‌‌ ఉందని, ఇన్వెస్ట్‌‌మెంట్లు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు.

ఇండియా తన వాణిజ్య లోటును టార్గెట్‌‌ పరిధిలో ఉంచుకోవాలని, దీని కోసం ఖర్చులను రేషనలైజేషన్ చేయడం, రెవెన్యూలను పెంచుకోవడం చేయాలని గీతా సూచించారు. ఒకవేళ పెట్టుబడులు అలానే బలహీనంగా ఉంటే,   గ్రోత్‌‌పై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇండియాకి వాణిజ్య టార్గెట్ విషయంలో స్థిరత్వం ఎంతో అవసరమని ఆమె చెప్పారు. 2019 పూర్తి బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి, 2019–20వ ఆర్థిక సంవత్సర వాణిజ్య లోటు టార్గెట్‌‌ను 3.4 నుంచి 3.3 శాతానికి కుదించారు.  ఇండియా కన్సాలిడేషన్ లోటు(కేంద్రానిది, రాష్ట్రాలది కలిపి) జీ20 దేశాల కంటే ఎక్కువగా ఉందని గీతా గోపినాథ్ అన్నారు.

దీన్ని చాలా కేర్‌‌‌‌ఫుల్‌‌గా మేనేజ్ చేయాలని సూచించారు. సంస్కరణలు చేపట్టడంలో ఇది కూడా చాలా ముఖ్యమైనదని తెలిపారు. మానుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌ షేరును పెంచడానికి, మరో అతిపెద్ద సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూ , కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆమె అన్నారు.

Latest Updates