ప్యాకేజ్డ్ డ్రింకింగ్ బాటిల్స్‌‌లో మరిన్ని మినరల్స్

న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌‌కు సంబంధించి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఒక లీటర్ నీళ్ల బాటిళ్లలో 20 మైక్రో గ్రాముల కాల్షియం, 10 మైక్రో గ్రాముల మెగ్నీషియాన్ని కలపనున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను విడుదల చేసింది. ఆరోగ్యానికి సంబంధించి మినరల్స్ చాలా ముఖ్యం కాబట్టి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌‌లో అదనంగా మినరల్స్‌‌ను కలిపే అవకాశాన్ని పరిశీలించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆదేశించింది. ఈమేరకు గతేడాది మే 29న ఎన్జీటీ సూచించగా.. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ రెండు సెషన్స్‌‌లో చర్చించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Latest Updates