క్యాబ్స్‌‌కు కళ్లెం?

బెంగళూరు : క్యాబ్‌‌‌‌‌‌‌‌ అగ్రిగేటర్లకు కొత్త రూల్స్ వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువున్న సమయాల్లో కస్టమర్లపై బేస్‌‌‌‌‌‌‌‌ ధర కంటే మూడు రెట్లు మాత్రమే ఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేసే అనుమతిని ప్రభుత్వం ఇవ్వనున్నట్టు కొత్త రెగ్యులేషన్స్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించిన వారికి సంబంధించిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. తమ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ పై క్యాబ్‌‌‌‌‌‌‌‌ల డిమాండ్‌‌‌‌‌‌‌‌, సప్లయిను రెగ్యులేట్ చేస్తూ.. ధర పెరుగుదలపై తమకు అనుకూలంగా ఉండాలని క్యాబ్ అగ్రిగేటర్లు ఉబర్, ఓలాలు ఎప్పడి నుంచో కోరుతున్నాయి. త్వరలోనే రెగ్యులేషన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం తీసుకొస్తుందని, పీక్‌‌‌‌‌‌‌‌ అవర్స్‌‌‌‌‌‌‌‌లో ధరల పెంపుపై ఒక పరిమితిని నిర్ణయిస్తుందని ప్రభుత్వ అధికారి తెలిపారు. 2016 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిపాదించిన అంశాల మేరకు ఇతర గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ ను కూడా జారీ చేస్తారని తెలుస్తోంది. డిమాండ్, సప్లయిలకు అనుగుణంగా ధరల పెంపు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త మోటార్ వెహికిల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత క్యాబ్‌‌‌‌‌‌‌‌ అగ్రిగేటర్లకు ఈ ప్రతిపాదిత రూల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి.  క్యాబ్‌‌‌‌‌‌‌‌ అగ్రిగేటర్లను ఈ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం డిజిటల్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీడియేటర్స్‌‌‌‌‌‌‌‌గా గుర్తించనుంది. అంతకుముందు ఈ క్యాబ్ అగ్రిగేటర్లను సెపరేట్ సంస్థలుగా పరిగణించలేదు. తీసుకురానున్న ఈ కొత్త రూల్స్ దేశమంతటా అమల్లోకి వస్తాయి. అయితే రాష్ట్రాలు తమకు వెసులుబాటు ప్రకారం ఈ రూల్స్‌‌‌‌‌‌‌‌ను మార్చుకునే అవకాశముంటుంది. అయితే ఆమోదించదగ్గదై ఉండాలి. క్యాబ్ అగ్రిగేటర్లను రెగ్యులేట్ చేసిన తొలి రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. కర్నాటక రాష్ట్రంలో యాప్ బేస్డ్ క్యాబ్ కంపెనీలకు ఇప్పటికే మినిమమ్, మ్యాక్సిమమ్ ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. వెహికిల్ ధర బట్టి శ్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ క్యాబ్‌‌‌‌‌‌‌‌లకు మినిమమ్, మ్యాక్సిమమ్​ ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య తేడా 2.25 శాతం ఉంటుంది. చిన్నక్యాబ్‌‌‌‌‌‌‌‌లకు 2 శాతం ఉంది.

Latest Updates