ఫుడ్‌‌ సేఫ్టీకి కొత్త రూల్స్​

వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమలు

న్యూఢిల్లీ: సాధారణ షాపులు కూడా ఆహార పదార్థాల నిల్వకాలం, ఎక్స్‌‌పైరీ తేదీ తదితర సమాచారాన్ని  ప్రకటించడాన్ని తప్పనిసరి చేసే కొత్త విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని ఫుడ్‌‌ సేఫ్టీ అండ్‌‌ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) ప్రకటించింది. ఇది వరకే  తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌‌, ఒడిశా, చండీగఢ్, గోవా, పుదుచ్చేరి, లడఖ్‌‌లోనూ ఫుడ్‌‌ సేఫ్టీ కాంప్లియెన్స్‌‌ సిస్టమ్‌‌ (ఎఫ్‌‌ఓఎస్‌‌సీఓఎస్‌‌) అమల్లో ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే నెల నుంచి ఈ రూల్స్‌‌ అమలవుతాయి. వీటి ప్రకారం.. స్వీట్‌‌ షాపులు.. నాన్‌‌–ప్యాకేజ్డ్‌‌, విడిగా అమ్మే స్వీట్స్‌‌కు ‘బెస్ట్‌‌ బిఫోర్ డేట్‌‌’ను ప్రకటించాలి.

 

 

Latest Updates