నెంబర్ పోర్టబులిటీకి కొత్త రూల్స్ ఇయ్యాల్టి నుంచే

    తేలికగా పోర్ట్ చేసుకోవచ్చు

    కానీ ట్రాయ్ షరతలు వర్తిస్తాయ్​

మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. అంతకుముందు కంటే తేలికగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌‌‌‌పీ) సిస్టమ్‌‌‌‌ను రూపొందించింది ట్రాయ్. అయితే ఈ సారి ట్రాయ్‌‌‌‌ తీసుకొచ్చిన రూల్స్‌‌‌‌లో మొబైల్ నెంబర్‌‌‌‌‌‌‌‌ పోర్టబులిటీకి కస్టమర్ అర్హుడో, కాదో తేల్చి చెప్పేది ట్రాయ్ మాత్రమే. ఇందుకోసం కొన్ని కండీషన్లను కూడా పెట్టింది. ఈ కండీషన్లను మీట్ అయితే పోర్టబులిటీ తేలికగా చేసుకోవచ్చు. ఆ కండీషన్లేమిటో ఓ సారి చూద్దాం..

  1. పోస్ట్ పెయిడ్ సర్వీస్‌‌‌‌ను వాడుతోన్న కస్టమర్‌‌‌‌‌‌‌‌ అయితే ప్రస్తుత టెలికాం ఆపరేటర్‌‌‌‌‌‌‌‌కు బాకీ ఉన్న మొత్తాలను నార్మల్ బిల్లింగ్ సైకిల్ ప్రకారం చెల్లించి ఉండాలి.
  2. ఏ మొబైల్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ కనెక్షన్‌‌‌‌ను అయినా కనీసం 90 రోజుల నుంచి వాడుతూ ఉండి ఉండాలి.
  3. ఒకవేళ మొబైల్ నెంబర్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ను మార్చుకుంటామని అప్పటికే రిక్వెస్ట్ పెట్టి ఉంటే, వారి నెంబర్ పోర్టబులిటీకి అర్హత లభించదు.
  4. చట్ట నిబంధన ప్రకారం నిషేధించబడిన మొబైల్ నెంబర్‌‌‌‌‌‌‌‌ను పోర్టబులిటీకి అనుమతించరు. న్యాయ స్థానాల పరిధిలో ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఎంఎన్‌‌‌‌పీ అర్హత పొందదు.
  5. మొబైల్ నెంబర్ పోర్ట్‌‌‌‌కు సబ్‌‌‌‌స్క్రయిబర్ ఎలిజిబుల్ అయితే, యునిక్ పోర్ట్ కోడ్‌‌‌‌(యూపీసీ)ను టెలికాం ఆపరేటర్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ జమ్ము అండ్ కశ్మీర్, నార్త్ ఈస్ట్‌‌‌‌ మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలకు నాలుగు రోజులు వాలిడిటీలో ఉంటుంది. జమ్ము అండ్ కశ్మీర్,నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు 30 రోజులు అందుబాటులో ఉంటుంది.

నెంబర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌కు ఛార్జ్ ఎంత..?

ప్రతి పోర్టింగ్ రిక్వెస్ట్‌‌‌‌కు ట్రాయ్ రూ.6.46 ఛార్జ్ చేస్తోంది. యూపీసీ వాలిడిటీలో ఉన్నంత వరకు ఇండివిడ్యువల్ యూజర్లకు పోర్టింగ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ కాదని ట్రాయ్ చెప్పింది. కార్పొరేట్ యూజర్లు, మొబైల్ నెంబర్ పోర్ట్‌‌‌‌  కోసం కార్పొరేట్ సంస్థలు  జారీ చేసే వాలిడ్‌‌‌‌ అథరైజేషన్‌‌‌‌ను లెటర్‌‌‌‌‌‌‌‌ను సమర్పించాల్సి ఉందని ట్రాయ్ పేర్కొంది. ఒకే సర్కిల్‌‌‌‌లో నెంబర్ పోర్ట్‌‌‌‌ కావాలంటే, మూడు రోజులు పడుతుంది. వేరే సర్కిల్‌‌‌‌కు పోర్ట్ చేయాలనుకుంటే, ఐదు రోజుల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది.  అంతకుముందు లాగా, నెంబర్ పోర్ట్‌‌‌‌ కోసం వారం రోజులు వేచిచూడాల్సిన పనిలేదు.

Latest Updates