కొత్త రూల్: బర్త్ డే కేక్ ముఖానికి పూస్తే కఠినశిక్ష

బర్త్ డే సెలబ్రేషన్స్ లో  కొత్త కండీషన్స్ పెట్టారు గుజరాత్ పోలీసులు. బర్త్ డే సెలబ్రేషన్స్ లో ముఖానికి కేక్ పూసినా, స్ప్రే  కొట్టినా వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామంటూ సర్క్యులర్ జారీ చేశారు.

బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఇటీవల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు . రోడ్లపైనే ఎక్కడ పడితే అక్కడ కేక్ పూసి, స్ప్రేలు కొట్టడం, బంప్స్ పేరుతో కింద పడేసి కొట్టడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో చూస్తున్నాం.  ఇలాంటి ఘటనల వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా  ఉంది. ఇలాంటి ఘటనే  ఇటీవల సూరత్ లోని  ఇమాస్ లో జరిగింది.  కొందరు యువతీ,యువకులు  రోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ముఖాలకు కేక్ పూసుకుని స్ప్రే కొట్టుకుని ,కోడిగుడ్లు విసురుకుంటూ రోడ్డు పై రచ్చ రచ్చ చేయడంతో  చాలా మంది వాహనదారులు పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి  గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశ్యంతోనే  కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు చెప్పారు గుజరాత్  పోలీసులు.

Latest Updates