నేటి నుంచి ఎస్ బీఐ కొత్త వడ్డీరేటు విధానం

New SBI interest rate rules for savings account, short-term deposits from May 1
  • రెపోరేటుకు సేవింగ్స్ డిపాజిట్లు, షార్ట్ టర్మ్ లోన్స్ లింక్
  • రూ.లక్షకు మించిన డిపాజిట్లకు 3.25 శాతం వడ్డీ

దేశంలోని బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌‌‌‌బీఐ) నేటి నుంచి కొత్త వడ్డీ రేటు విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ విధానంలో భాగంగా, సేవింగ్స్ అకౌంట్లలో లక్షకు మించిన డిపాజిట్లపై వడ్డీరేటును, ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌, క్యాష్ క్రెడిట్ సౌకర్యం లాంటి షార్ట్ టర్మ్ లోన్ల వడ్డీరేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) రెపో రేటుకు లింక్ చేస్తోంది.  అంటే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తన రెపో రేటును మార్చిన ప్రతిసారీ ఈ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల వడ్డీరేటు, కొన్ని షార్ట్ టర్మ్ లోన్ల వడ్డీరేట్లు ఆటోమేటిక్‌‌‌‌గా మారుతూ ఉంటాయి. ఈ విధానంతో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ రేట్లను  బ్యాంకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లోకి మెరుగ్గా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనుంది. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రెపో రేటుతో డిపాజిట్ అకౌంట్ల, లోన్ల వడ్డీరేటును లింక్ చేసిన తొలి బ్యాంక్‌‌‌‌ ఎస్‌‌‌‌బీఐనే.

 ఎస్‌‌‌‌బీఐ కొత్త వడ్డీరేటు విధానం గురించి…

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఫిబ్రవరి, ఏప్రిల్‌‌‌‌లో చేపట్టిన మానిటరీ పాలసీలో వరుసగా వడ్డీరేట్లకు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 6 శాతానికి చేరింది. నేటి నుంచి లక్షకు పైబడిన సేవింగ్స్ అకౌంట్లకు రెపో రేటు కంటే 275 బేసిస్ పాయింట్లు తక్కువగా..  వార్షికంగా 3.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నట్టు బ్యాంక్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పేర్కొంది. నిన్నటి వరకు రూ.కోటి వరకున్న డిపాజిట్ల అకౌంట్లకు 3.5 శాతం వడ్డీరేటు ఉంది. కోటికి పైబడిన డిపాజిట్లకు 4 శాతం వడ్డీ లభించింది. అంటే ప్రస్తుత రెపో రేటును పరిగణలోకి తీసుకుంటే రూ.లక్షకు పైబడిన ఎస్‌‌‌‌బీఐ సేవింగ్స్ అకౌంట్ల డిపాజిట్లు, చిన్న మొత్తాల డిపాజిట్ల కంటే కూడా తక్కువ వడ్డీరేటునే పొందుతాయి. లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న చిన్న అకౌంట్లకు వార్షికంగా వడ్డీరేటు 3.50 శాతంగా కొనసాగుతోందని బ్యాంక్ చెప్పింది. మొత్తం ఎస్‌‌‌‌బీఐ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్స్‌‌‌‌లో  95 శాతం లక్షలోపు  బ్యాలెన్స్‌‌‌‌ ఉన్నవారే.

ఒకవేళ రెపో రేటు పెరిగితే ఈ పెద్ద మొత్తాల ఎస్‌‌‌‌బీఐ సేవింగ్స్ అకౌంట్ల వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి.  లక్షకు పైబడిన అన్ని క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌లు కూడా నేటి నుంచి బెంచ్‌‌‌‌మార్క్ పాలసీ రేటుతో లింక్ కానున్నాయి.  లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌‌‌‌ను, లక్ష వరకు లోన్లు పొందిన క్రాష్ క్రెడిట్ అకౌంట్లను, ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌లను రెపో రేటు నుంచి లింక్ నుంచి మినహాయించాలని మాత్రం బ్యాంక్ నిర్ణయించింది

Latest Updates