దసరా నుంచి కొత్త సెక్రటేరియట్ పనులు

ఈ నెల16న టెండర్ ఫైనల్

ఆర్ & బీ ఈఎన్సీ గణపతిరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న కొత్త సెక్రటేరియెట్ ను కట్టేందుకు ఆరు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలతో బుధవారం ఆర్ & బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ప్రీ బిడ్డింగ్ మీటింగ్ నిర్వహించారు.  ఎర్రమంజిల్ లోని ఆర్ & బీ ఆఫీసులో జరిగిన ఈ మీటింగ్ కు టాటా, షాపూర్ జీ పల్లోంజీ, జేఎంసీ ప్రాజెక్ట్స్, ఎల్ &టీ, ఎన్ సీసీ, కేపీసీ ప్రాజెక్ట్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సెక్రటేరియెట్ టెండర్ కు సంబంధించిన అంశాలు, నిర్మాణం, నిధుల చెల్లింపు వంటి అంశాలపై కంపెనీల డౌట్లను నివృత్తి చేయటం కోసం ఈ మీటింగ్ పెట్టినట్లు ఈఎన్సీ గణపతి రెడ్డి తెలిపారు. ఈ నెల13న టెక్నికల్ బిడ్ ను, 16న ఫైనల్ బిడ్ ను ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. సెక్రటేరియెట్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. దసరా నుంచే కొత్త సెక్రటేరియెట్ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో సెక్రటేరియెట్‌ను నిర్మిస్తున్నామన్నారు.12 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని , కట్టడం పూర్తయ్యే వరకు ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు ఉండవని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.

For More News..

తెలంగాణకు మళ్లీ నీళ్ల గాయం

అటు కరోనా.. ఇటు రెసిషన్.. పేదరికంలోకి 15 కోట్ల మంది

బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్నస్కూల్ యాజమాన్యాలు

ఆస్తుల మ్యుటేషన్ బంద్.. అయోమయంలో కొనుగోలుదారులు

Latest Updates