హ్యాక్​ చెయ్యలేని ‘సెక్యూరిటీ సిస్టమ్​’

పాస్​వర్డ్​ .. ఎంత పకడ్బందీగా పెట్టుకున్నా, ఎన్నిసార్లు మార్చినా ఎప్పుడో ఒకప్పుడు హ్యాకర్లు వాటిని క్రాక్​ చేస్తూనే ఉన్నారు. ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడుతూనే ఉన్నారు. మరి, దానికి పరిష్కారం లేదా అంటే, ఎవరూ క్రాక్​ చేయలేని సెక్యూరిటీ సిస్టమ్​ను తయారుచేయడమే పరిష్కారమంటారు సైంటిస్టులు. మరి, అది సాధ్యమేనా? దాన్నే చేసి చూపించారు బ్రిటన్​లోని సెయింట్​ ఆండ్రూస్​ యూనివర్సిటీ సైంటిస్టులు. ఎవరూ క్రాక్​ చేయలేని, హ్యాక్​కు గురికాని సెక్యూరిటీ సిస్టమ్​ను తయారు చేశామంటున్నారు. క్వాంటమ్​ కంప్యూటర్లు వాడినా ఆ సెక్యూరిటీ సిస్టమ్​ను హ్యాక్​ చేయలేరని తేల్చి చెబుతున్నారు. ‘సిలికాన్​ చిప్స్​’తో కూడిన కాంప్లెక్స్​ నిర్మాణమే ఈ సిస్టమ్​ అని చెబుతున్నారు సైంటిస్టులు. ఓ సమాచారాన్ని పంపించడానికి దాంట్లోని కాంప్లెక్స్​ స్ట్రక్చర్లు మారిపోతుంటాయని, ఆ నిర్మాణాలను మళ్లీ యథా రూపంలోకి తీసుకురాలేమని అంటున్నారు. కాబట్టి ఎటాకర్​ హ్యాకింగ్​కు ట్రై చేసినా సాధ్యం కాదంటున్నారు. సిలికాన్​ చిప్స్​లలో సమాచారం కాంతి రూపంలో స్టోర్​ అవుతుందని, ఆ ఇన్ఫర్మేషన్​ కాంప్లెక్స్​ నిర్మాణాల ద్వారా వెళ్లినప్పుడు ఆ నిర్మాణాలు బెండ్​ అవుతాయని చెబుతున్నారు. అప్పుడు ఆ కాంతి రూపంలోని సమాచారం పరావర్తనం చెంది వేగంగా వెళ్లిపోతుందని అంటున్నారు.

Latest Updates