వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి CEC,HECల్లో కొత్త సబ్జెక్టులు

ఇంటర్మీడియేట్ సీఈసీ, హెచ్ఈసీలో కొత్త సబ్జెక్టులు రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మన దగ్గర ఇంటర్​లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. వీటిలో చాలా సంవత్సరాల నుంచి ఒకే రకమైన సబ్జెక్టులు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు కొంత సెలబస్​మారుస్తున్నా, సబ్జెక్టులు మాత్రం అవే ఉంటున్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ చదివిన వారు ఏదో చోట ఉపాధి పొందుతున్నా సీఈసీ, హెచ్ఈసీ చదివిన స్టూడెంట్స్​కు జాబ్స్​ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులను ఉపాధి కల్పించేలా మార్చాలని ప్రభుత్వం..అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో కాంబినేషన్​ కోర్సులపై బోర్డు దృష్టిపెట్టింది. ప్రస్తుతం డిమాండ్​ఉన్న జీఎస్టీ, చార్టర్డ్ అకౌంట్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ర్టానిక్స్, స్టాటిస్టిక్స్ తదితర సబ్జెక్టులను రూపొందించాలని నిర్ణయించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ చార్టర్డ్‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఐసీఏఐ) సహకారంతో సెలబస్ కూడా రూపొందించారు. వాటిలో మార్పులు చేర్పులపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఈనెలాఖరు నాటికి సెలబస్ ఫైనల్ చేసి, పుస్తకాలను ప్రింట్ చేయించే ఆలోచనలో ఇంటర్ అధికారులున్నారు. ప్రస్తుతమున్న మెయిన్​సబ్జెక్టులో ఒకటి తొలగించి, దానిస్థానంలో కొత్త సబ్జెక్టు యాడ్ చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి తీసుకొస్తామని ఇంటర్​బోర్డు కార్యదర్శి ఉమర్​ జలీల్​తెలిపారు.

Latest Updates