డేటా డిలీట్ చేసినా తప్పించుకోలేరు

    లేటెస్ట్ టెక్నాలజీతో బ్యాకప్ సెల్స్

    18 కీలక కేసుల్లో డిజిటల్ డాక్యుమెంట్స్

‘ సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ల నుంచి ఎవరికైనా అసభ్యకర వీడియోలు, ఫొటోలు, మెసెజ్ లు పోస్టు చేసి డేటాను డిలీట్ చేస్తే తప్పించుకోవచ్చని అనుకుంటున్నారా..అయితే మీ డేటాను పోలీసుల బ్యాకప్ సెల్ పట్టేస్తుంది. దీని సాయంతో పోలీసులు డేటా రికవరీ చేసి  కోర్టులో పక్కా ఎవిడెన్స్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

హైదరాబాద్, వెలుగువాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అడ్డాగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. తాము టార్గెట్ చేసిన మహిళలు, యువతులను వేధిస్తూ అసభ్యకర వీడియోలు, ఫొటోస్ తో పాటు మార్ఫింగ్ చేసిన పోస్టింగ్స్ తో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేరం చేసిన తరువాత మొబైల్,కంప్యూటర్స్ లోని డేటాను డిలీట్ చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రికవరీ టూల్స్ తో

స్మార్ట్ ఫోన్స్ తో పాటు లాప్ ట్యాప్, కంప్యూటర్ సహా ఎలాంటి డిజిటల్ డివైజ్ డేటాను డిలీట్ చేసినా దాన్ని రికవరీ చేసేందుకు  పోలీసుల చేతుల్లోకి అధునాతన ఎక్విప్ మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సీఐడీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో  డేటా బ్యాకప్ కోసం స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు. దీంతో డిలీట్ చేసిన డేటాను బ్యాకప్ చేసి సైబర్ క్రైం పోలీసులు నేరాలను రుజువు చేస్తున్నారు. 2017 జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన డేటా బ్యాకప్ సెల్ ద్వార అనేక కీలక కేసుల్లో పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరించారు. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు,వ్యాపార వేత్తలకు సంబంధించిన కేసుల్లో డిజిటల్ ల్యాబ్ అందించిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.

డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్స్

ఫొరెన్సిక్ ల్యాబ్, సీఐడీ సెంట్రల్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న ‘డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్’ కు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కీలక కేసుల్లో సాక్ష్యాధారాల డేటా బ్యాక్ చేస్తున్నారు. ఇందులో ‘యూనివర్సల్ ఫొరెన్సిక్ ఎక్స్ట్రాక్షన్ డివైజ్’ ద్వారా  నిమిషానికి 3వేల వరకు లాజికల్, ఫిజికల్ మొబైల్ డేటాను బ్యాకప్ చేయవచ్చు. చైనా ఫోన్ల బ్యాకప్ కోసం స్పెషల్ గా తయారు చేసిన ‘టారంటులా’ అనే ఈ డిజిటల్ డివైజ్ తో 1 జీబీ నుంచి 20 జీబీ వరకు ఎలాంటి డేటానైనా సరే నిమిషాల్లో బ్యాకప్ చేస్తున్నారు. దీంతో పాటు నేరాలకు ఉపయోగించిన కంప్యూటర్లు,లాప్ ట్యాప్ ల నుంచి తొలగించిన డేటాను నిమిషాల  వ్యవధిలోనే రికవరీ చేసి కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కు పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇలా సీఐడీ సైబర్ క్రైం డిపార్ట్ మెంటులో ఉన్న డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్  తో గతేడాది 18 కీలక కేసుల్లో డేటాను బ్యాకప్ చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టులో ప్రవేశపెట్టారు.

 ఈ ఏడాది జయరామ్ హత్య కేసులో

ఈ ఏడాది జనవరి 31న జరిగిన వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ నుంచే పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్లాన్ ప్రకారం జయరామ్ ను హత్య చేసిన రాకేశ్ రెడ్డి అండ్ గ్యాంగ్ సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్స్ నుంచి డిలీట్ చేసిన13 ఫొటోలను, 11 వీడియో క్లిప్పింగ్స్ ను పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసును పూర్తిగా టెక్నాలజీ ఆధారంగానే దర్యాప్తు చేసి 12 మంది నిందితుల కాల్ డేటా,మొబైల్ చాటింగ్స్,వీడియో క్లిపింగ్స్ ను కోర్టులో డిపాజిట్ చేశారు.

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీనివాస్ రెడ్డి కేసులో మొబైల్ ఫోన్,ఫేస్ బుక్ డేటా ఆధారంగా బాధితులను గుర్తించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లోని డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ తో డేటా బ్యాకప్ చేశారు. నిందితుడి సెల్ ఫోన్ లో ఉన్న మెసేజ్,168 కి పైగా ఫొటోలు,వీడియోల ఆధారంగా ఛార్జిషీట్ ఫైల్ చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసులో మొత్తం300 మందికి పైగా సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ తో నేరం నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు అందజేశారు.

Latest Updates