ఒలింపిక్స్‌ పై కన్నేసి ఆసియా బరిలో..

New test for Mirabai Chanu at Asian Championships 2019
  • ఫేవరెట్ గా మీరాబాయి
  • నేటి నుంచి ఆసియా వెయిట్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌

నింగ్బో (చైనా): ప్రపంచ మాజీ చాంపియన్, ఇండియా స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను కీలక సవాల్‌ కు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలిం పిక్స్‌ అర్హత అవకాశాలను మెరుగు పరుచుకోవడమే లక్ష్యంగా శనివారం మొదలయ్యే ఆసియా వెయిట్‌ లిఫ్టిం గ్‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌ లో బరిలోకి దిగనుంది.ఒలింపిక్స్‌ నేపథ్యం లో వెయిట్‌ కేటగిరీలను అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌ )పునర్‌ వ్యవస్థీకరిం చిన తర్వాత 48 కేజీల నుంచి 49కేజీల విభాగానికి మారిన మీరా ఈ మెగా టోర్నీలోఇండియాను ముందుండి నడిపించనుం ది. గాయం కారణంగా తొమ్మిది నెలలు ఆటకు దూరంగా ఉన్నచాను ఇటీవలే అదిరిపోయే రీఎంట్రి ఇచ్చిం ది.

ఆరు ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్లలో మొదటిదైన ఇగాట్‌ కప్‌ టోర్నీలో గోల్డ్‌ మెడల్‌ నెగ్గింది. ఫిబ్రవరిలో జరిగిన ఆ టోర్నీలో 24 ఏళ్ల మీరా మొత్తం 192(స్నాచ్‌ లో 82 , క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌ జెర్క్‌ లో 110 ) కేజీల బరువు మోసింది. అయితే, ఆ టోర్నీతో పోల్చితే ఆసియా చాంపియన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌ లో పోటీ ఎక్కు వ కాబట్టి ఇండియా స్టార్‌ తన పెర్ ఫామెన్స్‌ను మెరుగుపరుచుకోవాల్సి  ఉంటుంది. 49 కేజీల విభాగంలో పోటీపడే వారిలో థాయ్‌ లాండ్‌ వెయిట్‌ లిఫ్టర్‌ చయుత్రప్రమోంగ్‌ కోల్‌ .. 2018 వరల్డ్‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌ లో209 (89+10) కేజీలతో స్వర్ణం గెలిచిం ది. చైనాకు చెందిన హౌ జిహుయ్‌ , జియాంగ్‌ హుయిహువా 208, 206 కేజీలతో రజతం, కాంస్యం దక్కించుకున్నారు.  ఈ లెక్కన.. కాంస్యం గెలిచిన లిఫ్టర్‌ ఇగాట్‌కప్‌ లో మీరాబాయి (192) కంటే 14 కేజీలు ఎక్కువ మోసింది.

ఈ నేపథ్యంలో మీరాబాయి కనీసం తన పర్సనల్‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 196 కేజీల మార్కు ను దాటాలని కృషి చేస్తోం ది. పురుషుల విభాగంలో కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్ డబుల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సతీశ్‌ శివలిం గం, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వెంకట రాహుల్‌ ఈ టోర్నీగా దూరంగా ఉన్నా రు. దాంతో, యూత్‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , 16 ఏళ్ల జెరెమీ లాల్​రినుంగాపై అందరి దృష్టి ఉంది. 62 నుంచి 69 కేజీల కేటగిరీకి మారిన జెరెమీ ఇగాట్‌ కప్‌ లో 188 కేజీలతో రజతం గెలిచి జోరు మీదున్నాడు. కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌ (96కేజీ), అజయ్‌ (81 కేజీ) బరిలో ఉన్నారు.

Latest Updates