నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్‌

సుప్రీం కోర్టులో ముఖేశ్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడు. తనకు ఉన్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకునేందుకు చాన్స్‌ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, అడ్వకేట్ బృందా గ్రోవర్‌‌లు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, వారిపై సీబీఐ విచారణ జరిపించాలని ముఖేష్‌ తరఫున లాయర్‌‌ శర్మ కోర్టులో పిటిషన్‌ వేశారు. “పిటిషనర్‌‌ ముకేశ్‌ ఆర్‌‌–1 (మినిస్ట్రీ ఆఫ్‌ హోం అఫైర్స్‌), ఆర్‌‌–2 (ఢిల్లీ గవర్నమెంట్‌), ఆర్‌‌ – 3 (బృందా గ్రోవర్‌‌)ల క్రిమినల్‌ కుట్ర, మోసానికి బాధితుడు. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బెదిరిస్తూ పలు డాక్యుమెంట్లపై సంతకం చేయమని అతడిని బలవంతం చేశారు. సెషన్స్‌ కోర్టు కొన్ని వకల్తాపై సంతకం చేయాలని చెప్పారని అబద్ధాలు చెప్పి చేయించుకున్నారు సెషన్స్‌ కోర్టు అలా చెప్పలేదని బాధితుడికి ఇప్పుడే తెలిసింది.” అని శర్మ అన్నారు. రివ్యూ పిటిషన్ కొట్టేసిన మూడేళ్ల వరకు క్యురేటివ్‌ పిటిషన్‌ వేసుకునే అవకాశం ఉన్నందున జులై 2021 లోపు క్యురేటివ్‌, మెర్సీ పిటిషన్‌ వేసుకునే హక్కును కల్పించాలని కోర్టును కోరారు. సుప్రీం కోర్టు 2018 జులైలో ముఖేశ్‌ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. దోషులకు ఈ నెల 20న ఉరిశిక్ష అమలుచేయాలని నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేశారు.

For More News..

కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

ఈసారి బడ్జెట్ ​1.55 లక్షల కోట్లు!

 

Latest Updates