31 ఏళ్ల తర్వాత భారత్ చెత్త రికార్డు

మౌంట్‌ మాంగనీ: కివీస్ తో 3 వన్డేల సిరీస్ లో వైట్ వాష్  అయిన భారత్.. 31 సంవత్సరాల తర్వాత చెత్త రికార్డును నమోదు చేసింది. ఇలా టీమిండియా మూడు, అంతకంటే ఎక్కువ వన్డే మ్యాచుల్లో వైట్‌ వాష్‌ కావడం ఓవరాల్‌ గా నాల్గోసారి. 1983-84 సీజన్‌ లో విండీస్‌ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ లో వైట్‌ వాష్‌ అయిన టీమిండియా.. 1988-89లో అదే టీమ్ పై మరోసారి వైట్‌ వాష్‌ అయ్యింది. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ ల వన్డే సిరీస్‌ లో.. మొత్తం మ్యాచ్‌ లు జరిగిన క్రమంలో టీమిండియా వైట్‌వాష్‌ కావడం ఇదే ఫస్ట్ టైమ్.

2006-07 సీజన్‌ లో సౌతాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ లో టీమిండియా 4-0తో సిరీస్‌ ను కోల్పోయినా, ఒక వన్డే జరగలేదు. దీంతో 31 సంవత్సనాల తర్వాత సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు ఓడి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది భారత్. ఓవర్ కాన్ఫిడెంట్, మిస్ ఫీల్డింగ్, గాయం తర్వాత రాణించని బుమ్రా బౌలింగ్ సిరీస్ వైట్ వాష్ కు కారణంగా చెబుతున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. సీనియర్స్ లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

చెల్లుకు చెల్లు: టీమిండియాకు కివీస్ వైట్‌వాష్

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్

 

Latest Updates