సీన్ రివర్స్.. వన్డే సిరీస్ కివీస్ దే

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లో మాత్రం సీన్ రివర్సయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా  శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ లో కూడా ఓడిన ఇండియా ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది.

రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీం ఇండియా 48.3 ఓవర్లలో  251 పరుగులకే ఆలౌటై 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Latest Updates