టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్‌

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో మూడో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి రెండు వన్డేలలో విజయం సాధించిన కివీస్.. ఎలాగైన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లో వైట్ వాష్ కావడంతో ఈ సిరీస్‌లో ఇండియాను వైట్‌వాష్ చేసి రివేంజ్ తీర్చుకోవాలని కివీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఓవల్ స్టేడియం ఇండియాకు కొంచెం కలిసొచ్చేదిగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇక్కడ గతంలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచి భారత్ పరువు నిలుపుకుంటుందో లేక కివీస్ ఆటగాళ్ల ముందు మోకరిల్లుతుందో చూడాలి.

కివీస్ బౌలింగ్ తీసుకోవడంతో భారత్ తరపున మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపేనర్లుగా దిగారు. జామిసన్ వేసిన రెండో ఓవర్లో అగర్వాల్ బౌల్డ్ అవ్వడంతో కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.

Latest Updates