టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో T20 మ్యాచ్‌లో అతిథ్య జట్టుతో తలపడుతోంది. హోమిల్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ గ్రౌండ్ లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించి 2-0 ఆధిక్యంలో ఉంది.  ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా జరుగుతోన్న ఇవాళ్టి మ్యాచ్‌ కూడా గెలిస్తే కప్ భారత్ సొంతమవుతుంది. మరోవైపు కనీసం మూడో మ్యాచ్‌లోనైనా గెలవాలన్న కసితో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ ఆడుతోంది. మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాలో ఎటువంటి మార్పులు లేవు.

జట్ల వివరాలు:

ఇండియా: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, శివమ్‌ దూబె, జడేజా, చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, షమి, బుమ్రా.

న్యూజిలాండ్: గప్తిల్‌, మన్రో, సీఫెర్ట్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌‌), రాస్‌ టేలర్‌, గ్రాండ్‌హోమ్‌‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, సౌథీ, కుగ్‌లీన్‌, బెనెట్‌.

Latest Updates