నడిరోడ్డుపై ప‌సికందు.. అక్కున చేర్చుకున్న GHMC స్వీప‌ర్

హైద‌రాబాద్‌: అప్పుడే పుట్టిన ప‌సిపాప‌ను న‌డిరోడ్డుపై వ‌దిలివెళ్లారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. న‌గ‌రంలోని కోఠి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఈ దారుణం జ‌రిగింది. న‌డిరోడ్డుపై ప‌డిఉన్న ఆ ప‌సికందును అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటింది ఓ మున్సిప‌ల్ కార్మికురాలు (జిహెచ్ఎమ్‌సీ స్వీప‌ర్). ఈ విష‌యాన్ని స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పాప‌ను మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులకు అప్పగించారు.

Latest Updates