ఆ పసి పాప చేసిన పాపం ఏంటి

ఆడపిల్లగా పుట్టడమే నేరమా..!  అమ్మ వెచ్చటి పొత్తిళ్లలో తలదాచుకోవాల్సిన చిన్నారులను నిర్దాక్షణ్యంగా రోడ్డుపాలు చేస్తున్నారు.

మానవత్వమున్న మనుషులమని మరిచిపోతున్నారు. ఆడ శిశువని భారం దించుకొనేందుకో, కారణమేదైతేనేం, దుర్మార్గుల్లా మారుతున్నారు.అప్పుడే పుట్టిన ఆడ శిశువును గోనె సంచిలో కట్టి చెత్తబుట్టలో పడేస్తున్నారు మానవత్వం లేని మనుషులు.

నవ మాసాలు మోసి , కని పెంచిన ఆ తల్లికి బిడ్డ భారం అయ్యింది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇదే జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు వంగూర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామ శివారులోని వంకబావి రోడ్డులో గుట్టల్లో ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని దుండగులు సంచిలో ఆడ శిశువును వదిలివెళ్లారు. అయితే అటువైపుగా వెళుతున్న చిన్నారి కేకల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుల సాయంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉందని, ఆడపిల్ల కావడంతో వదిలివెళ్లినట్లు తెలుస్తోంది.

 

Latest Updates