రాష్ట్రంలో 1,273 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,30,274 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి ఐదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,303కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,708 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,09,034గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,937 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 16,809 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 35,280 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 40,52,633 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 90.77 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 227, మేడ్చల్ 104, రంగారెడ్డి 102, నల్గొండ 76, ఖమ్మం 75, భద్రాద్రి 69, కరీంనగర్ 55, వరంగల్ అర్బన్ 51, సిద్ధిపేట్ 41, కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

మన బతుకు సంస్కృతి బతుకమ్మ

రాజకీయాలు తెలియని లీడర్​ నాయిని

బీహార్‌లో నితీశ్‌ను మోడీ కాపాడగలరా?

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

Latest Updates