తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,456 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,27,580 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1292కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,717 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,06,105గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,183 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 16,977 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 38,565 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 39,78,869 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 90.56 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్ 98, రంగారెడ్డి 98, నల్గొండ 92, ఖమ్మం 89, భద్రాద్రి 82, కరీంనగర్ 54, కామారెడ్డి 48, సిద్ధిపేట్ 47, సంగారెడ్డి 43, వరంగల్ అర్బన్ 40 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

మహబూబాబాద్‌ కిడ్నాప్‌లో విషాదం.. బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన నిందితులు

సీరియస్‌గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

ఆంధ్రాకు కేంద్రం హెచ్చరిక.. కరోనా డేంజర్ జిల్లాల్లో 5 ఏపీ జిల్లాలు

Latest Updates