రాష్ట్రంలో మరో 2,043 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,043 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,67,046 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1016కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1802 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,35,357గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,081 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో 50,634 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 23,79,950 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 314, రంగారెడ్డి 174, మేడ్చల్ 144, నల్గొండ 131, సిద్ధిపేట్ 121, కరీంనగర్ 114, వరంగల్ అర్బన్ 108, ఖమ్మం 84, మహబూబా బాద్ 74, సంగారెడ్డి 71, కామారెడ్డి 68, నిజామాబాద్ 65, సూర్యపేట్ 51, భద్రాద్రి 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

మోడీ టీనేజ్ లైఫ్ విశేషాలతో ‘మనో విరాగి’

కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి రాజీనామా

కరోనా గురించి ఆలోచిస్తూ.. ఆ వ్యాధిని మరవొద్దు

Latest Updates